Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

ChandraBabu Naidu failed to complete all his promises: YS Jagan

By   /  April 11, 2018  /  Comments Off on ChandraBabu Naidu failed to complete all his promises: YS Jagan

    Print       Email

చేనేత‌ల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణం బాబే

InCorpTaxAct
Suvidha

 

 

 

* నాలుగేళ్లుగా ఒక్క హామీ అమ‌లు చేయ‌ని బాబు

* 34 మంది చ‌నిపోతే క‌నీసం ఒప్పుకోనూలేదు

* వైయ‌స్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అంద‌రికీ ఆదుకుంటాం

* చేనేత‌ల ఆత్మీయ స‌ద‌స్సులో వైయ‌స్ జ‌గ‌న్‌

డెక్క‌న్ అబ్రాడ్: చ‌ంద్రబాబు నాయుడి నాలుగేళ్ల పాల‌న చూసుకుంటే ఆత్మ‌హ‌త్య‌లు..ఆక‌లి చావులే క‌నిపిస్తాయ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. ఎన్నిక‌ల ముందు చేనేత‌లకు ఎన్నోహామీలు ఇచ్చి ఏ ఒక్క‌టీ నెర‌వేర్చిన పాపాన పోలేద‌న్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన చేనేత సభలో మాట్లాడిన జగన్ టీడీపీ పాలనపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు దారుణ పాలన ఫలితంగా పొందూరు, మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం, ఎమ్మిగనూరు ఇలా ఎక్కడ చూసినా చేనేత‌ల ఆత్మహత్యలే కన్పిస్తాయని విమర్శించారు. ధర్మవరంలో 34 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే తాను స్వయంగా బాధిత కుటుంబాలను పరామర్శించానని, శాసనసభలో ఈ విషయమై నిలదీసి అడిగితే చంద్రబాబు స్పందించకపోగా ఎక్కడ మరణించారంటూ అవహేళన చేశారని, మరణించినట్లు ఒప్పుకుంటే ఐదు లక్షలు ఇవ్వాల్సి వస్తుందని, ఇందుకు ఆయనకు మనసొప్పలేదని జగన్ అన్నారు. ఎన్నికల ప్రణాళికలో రుణాలు మాఫీ చేస్తానని, తక్కువ వడ్డీకి లక్ష రూపాయల రుణాలు ఇస్తానని చెప్పాడని, ఎవరికైనా అందాయా అని జగన్ ప్రశ్నించారు. గడిచిన నాలుగేళ్లల్లో 4 వేల కోట్లు చేనేతకు ఖర్చు పెడతానని హామీ ఇచ్చి కేవలం 183 కోట్లే ఖర్చు చేశారని జగన్ విమర్శించారు.

జిల్లాకో చేనేత పార్కు ఏర్పాటు చేస్తానని, లక్షా 50 వేలతో ఇల్లు, మగ్గం షెడ్డు కేటాయిస్తానని చెప్పినప్పటికీ పార్కు, ఇల్లు రెండూ లేవని జగన్ అన్నారు. పేద కుటుంబాల పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా నిలిపి వేశారని, దేవుడు ఆశీర్వదించి మీ చల్లని దీవెనలతో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంత ఖర్చైనా పేద పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు చదివేందుకు అవకాశమిస్తామన్నారు. ఆరోగ్యశ్రీని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, మంగళగిరికి చెందిన ఓ పేద కుటుంబం తన బిడ్డకు మూగ చెవుడు ఉంటే ఆపరేషన్ జరగక తన దృష్టికి తీసుకొచ్చారని జగన్ అన్నారు. ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయని, ఎటువంటి పాలన , ఎటువంటి నాయకుడు కావాలో ఆలోచించాలని, అబద్దాలు మోసాలు చేసే వారు కావాలా అని జగన్ ప్రశ్నించారు.

నవరత్నాలు అమల్లోకి తెస్తానని, అమ్మ ఒడి పధకం ద్వారా వైఎస్ పాలన తెస్తామని, పేదలకోసం నాన్న (వైయ‌స్ఆర్‌) ఒకడుగు ముందుకేస్తే జగన్ రెండడుగులు ముందుకేస్తాడని , పేద కుటుంబాల్లోని పిల్లలు ఏ ఉన్నత చదువు చదివినా ఖర్చు ఎంతైనా భరిస్తామని, వారి హాస్టల్, మెస్ ఖర్చులకు కూడా 20 వేలు ఇస్తామన్నారు. పిల్లలను బడికి పంపించే విధంగా తల్లుల్ని ప్రేరేపించేందుకు 15 వేలు ఇస్తామని జగన్ పునరుద్ఘాటించారు. వృద్ధులకు నెలకు 2 వేల రూపాయలు ఇస్తామని జగన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలకు పెన్షన్ 45 ఏళ్లకే ఇస్తామని జగన్ అన్నారు. పేదలకు నిర్మించే ఇళ్ల పధకంలోను చంద్రబాబు కుంభకోణానికి పాల్పడుతున్నాడని, తమ ప్రభుత్వం రాగానే అందరికీ ఇళ్లు కట్టిస్తానని జగన్ అన్నారు. వేయి రూపాయలు దాటిన ఏ వైద్య ఖర్చైనా ఆరోగ్యశ్రీ పథకంలో వచ్చే విధంగా సమూలంగా మార్పులు చేస్తామని, చేనేతకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి నెలకు 2 వేలు సబ్సిడీ అందజేస్తామని జగన్ హామీ ఇచ్చారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →