Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandrababu Naidu in Kazakhstan, Russia to woo investors

By   /  July 11, 2016  /  Comments Off on Chandrababu Naidu in Kazakhstan, Russia to woo investors

    Print       Email

babuఅమరావతికి అండగా అస్తానా

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్రపంచ నగరాల్లో నిర్మాణశైలిలో అద్భుతంగా ప్రశంసలు పొందుతున్న కజకిస్థాన్ రాజధాని అస్తానాలో  ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న మంత్రి వ‌ర్గ బృందం నిన్న ప‌ర్య‌టించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అస్తానా మేయర్ అస్సెట్ లెస్కెషోవ్ తో స‌మావేశ‌మ‌య్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తికి క‌జ‌కిస్థాన్ స్నేహ హ‌స్తం అందించ‌డానికి సిద్ధంగా ఉంద‌ని, ఏపీ రాష్ట్ర అభివృద్ధికి త‌మ వంతు స‌హ‌కారం అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. దీంతో అమరావతి నగర నిర్మాణానికి ఇద్దరూ వచ్చే నెలలో ఒక ప్రాథమిక అవగాహనా ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి  చంద్రబాబు మాట్లాడుతూ గత ఏడాది భారత ప్రధాని నరేంద్రమోడీ ఇక్కడ పర్యటించి ఈ నగర నిర్మాణ కౌశలాన్ని ప్రశంసించారని, నగరాన్ని సందర్శించాలని తనకు సూచించారని గుర్తు చేశారు. అందుకే ఈ న‌గ‌రాన్ని చూసేందుకు త‌న బృందంతో వ‌చ్చిన‌ట్లు చంద్ర‌బాబు పేర్కొన్నారు.

ఇంకా చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే… ‘అస్తానా నగరాన్ని నేను పరిశీలించాను. అందంగా, అద్భుతంగా ఉంది. ఇది ఎంతో నూతన, అత్యంత అధునాతన, క్రియాశీల నగరం. గతంలో మీరు విభజన ఫలితాన్ని చూశారు. ప్రస్తుతం రాష్ట్ర విభజనకు గురయిన మేం అదే స్థితిలో ఉన్నాం. మీరు దేశ రాజధానిని నిర్మించుకున్నారు. నేను రాష్ట్ర రాజధానిని నిర్మించుకోవాలి. నాకు సైబరాబాద్‌ను నిర్మించిన అనుభవం  ఉంది. ఇక్కడికి వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మేం మీ నగరం నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. మా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అస్తానా అనుభవాలను స్వీకరించదిలిచాం. అస్తానా నగర రూపశిల్పులు, నిర్మాణంలో పాల్గొన్న నిపుణుల వివరాలు, వారి అనుభవాలు మాకు ఇవ్వండి. మేం ఇక్కడికి వచ్చాం. మీరు కూడా అమరావతిని సందర్శించండి. పరస్పరం సహకరించుకోవటానికి మనం ఒక రోడ్ మ్యాప్ రూపొందించుకుందాం’ అని  ఏపీ సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →