Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

ChandraBabu Naidu is Showing More Interest in National Politics to Pave the way for Lokesh!

By   /  March 30, 2018  /  Comments Off on ChandraBabu Naidu is Showing More Interest in National Politics to Pave the way for Lokesh!

    Print       Email

బాబు ఎందుకు అలా మాట్లాడారు?

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* జాతీయ రాజ‌కీయాల‌వైపు వెళ్తున్నారా?

* లోకేష్‌కు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారా?

* 2019 ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో ఏం జ‌ర‌గ‌బోతోంది?

డెక్క‌న్ అబ్రాడ్‌:  ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు టీడీపీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే 2019 ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్ర రాజ‌కీయాల్లో పెనుమార్పులు జ‌రిగే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో చాలా సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉన్న చంద్ర‌బాబు ఇప్పుడు ఆయ‌న చూపు కేంద్రంపై ప‌డిన‌ట్లుగా ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. గుంటూరులోని ఏపీ టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన 37 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ… జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నామని అన్నారు. అంతేకాదు కూటమి రాజకీయాలకు తొలుత పునాది వేసింది టీడీపీనేన‌ని వ్యాఖ్యానించారు. గతంలో ఒక రాష్ట్రపతి, ఇద్దరు ప్రధానులను నిర్ణయించాం.. 2019 ఎన్నికల తర్వాత కూడా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ లాంటి నేతలే ఎన్టీఆర్‌ను, టీడీపీని ఏమీ చేయలేకపోయారని, సంక్షోభాలను అవకాశంగా మార్చుకుంటామని ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకు నాడు పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, రాజకీయాలతో పేదరిక నిర్మూలన జరగాలనేది ఆశయంగా పెట్టుకున్నారని తెలిపారు.

అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. చంద్ర‌బాబు జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లితే రాష్ట్రంలో టీడీపీని లోకేష్‌కు అప్ప‌గిస్తారా?  లేదా చంద్ర‌బాబే చూసుకుంటారా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మిగ‌ల‌నుంది.  లోకేష్‌కు అనుభం లేక‌పోవ‌డం, ఇంకా త‌న‌ను తాను నిరూపించుకునే క్ర‌మంలోనే ఉండ‌డం బాబుకు కొంత ఇబ్బంది పెట్టే అంశ‌మే. అయితే చంద్ర‌బాబు ఆ వ్యాఖ్య‌ల‌ను మామూలుగానే చేశారా?  లేదా జాతీయ రాజ‌కీయాల వైపు ఆస‌క్తి చూపుతున్నారా అన్న‌దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →