Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandrababu Scheduled to meet PM Narendra Modi

By   /  January 6, 2018  /  No Comments

    Print       Email

12న ప్రధానితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ..!

 

Suvidha
Biryani Pot

 

 

 

ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీకి అపాయింట్ మెంట్ ఖరారయింది. ఈ నెల 12వ తేదీన వీరిద్దరూ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని అంశాలతో పాటు పలు విషయాలపై వీరిరువురూ చర్చించనున్నారు. శుక్రవారం ప్రధానితో టీడీపీ ఎంపీలు భేటీ అయిన సందర్భంగా ప్రధాని ఈ భేటీ ఖరారైనట్లు తెలిపినట్లు తెలిసింది. ప్రధానితో భేటీలో పోలవరం, విభజన అంశాలు, అసెంబ్లీ సీట్ల పెంపు మొదలగు విషయాలపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. అంతేగాక కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా ఏపీలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. సీఎం, పీఎంల భేటీ తర్వాత టీడీపీ, బీజేపీ సంబంధాల్లో సానుకూల వాతావరణం ఏర్పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏడాదికాలంగా చంద్ర‌బాబుకు మోడీ అపాయింట్ మెంట్ దొర‌క‌లేదు. చంద్ర‌బాబు ప్ర‌ధానితో స‌మావేశ‌మ‌య్యేందుకు ప్ర‌య‌త్నించినా.. పీఎంవో నుంచి రిప్లై రాలేదు. మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లోనే చంద్ర‌బాబుతో భేటీ అయ్యేందుకు మోడీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

 

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Nata Matrimony- @NATA Convention, Philadelphia, PA July 6th to July 8th 2018

Read More →