Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandrababu speech @ inauguration of Thermal Power Plant at Nellore

By   /  February 27, 2016  /  Comments Off on Chandrababu speech @ inauguration of Thermal Power Plant at Nellore

    Print       Email

chandra babu naidub

ప్రజలకు అభివృద్ధి కావాలి.. ప్రతిపక్షాలకు రాజకీయం కావాలి: ఏపీ సీఎం చంద్రబాబు

InCorpTaxAct
Suvidha

 

కేంద్రం అండదండలతో కరెంటు కోతలను అధిగమించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా నేలటూరులో నిర్మించిన ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు. నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నామని అన్నారు. భవిష్యత్‌లో కరెంటు కోతలు ఉండవని తెలిపారు. కరెంట్ కనెక్షన్ లేని ఇళ్ళంటూ ఏపీలో ఉండవద్దని అన్నారు.అలాగే కరెంట్ ఆదా కోసం ఎల్‌ఈడీ బల్బులను కూడా పంపిణీ చేశామని చెప్పారు.

ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా పేదలకు అందాలనేది తమ ఆకాంక్ష అని చంద్రబాబు నాయుడు చెప్పారు. ముందు చెప్పినట్లుగానే వెయ్యి పెన్షన్‌ హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. ఇసుక ఉచితంగా తీసుకెళ్లే పద్ధతికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఏపీ ప్రజలు అందరూ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ఏపీ సీఎం పిలుపునిచ్చారు. ఫైబర్‌ నెట్‌వర్క్‌ ద్వారా జూన్‌లోగా ప్రతి ఇంటికి కేబుల్‌, ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. త్వరలో స్మార్ట్‌ పవర్‌ గ్రిడ్‌ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీని వల్ల ఏ ఇంట్లో ఎంత కరెంటు వాడారో తెలుసుకోవచ్చని అన్నారు. సౌర‌ విద్యుత్, విండ్ పవర్ ఉత్పత్తికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు.

విద్యుత్‌ రంగంలోని అన్ని అవార్డులు ఏపీకి దక్కాయని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. ఏపీ క్రమంగా నాలెడ్జ్‌ హబ్‌గా తయారవుతోందన్నారు. ప్రతిపక్షాలకు రాజకీయం కావాలి.. ప్రజలకు అభివృద్ధి కావాలన్న చంద్రబాబు.. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపణలు గుప్పించారు. పనిచేసే ప్రభుత్వాలకు ప్రజలు మద్దతివ్వాలని కోరారు. అభివృద్ధి నిరోధక శక్తులకు మద్దతిస్తే ప్రజలే నష్టపోతామని తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →