బాబు..వెంకయ్య.. మేడిపండు చందం!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇద్దరూ కూడా చూడడానికి మేడిపండు చందంలా కనిపిస్తుంటారు. మేడిపండు చూడు మేలిమై ఉండు అన్నట్లుగా ఇద్దరూ కూడా పైకి అలా కనిపిస్తుంటారని, లోపల మాత్రం బద్ధశత్రువులని వినికిడి. అయితే ఇటీవల పరిణామాలు చూస్తాఉంటే అవుననే నమ్మాల్సి వస్తోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరు వేర్వేరు పార్టీలో క్రీయాశీలంగా ఉన్నారు. ఒకరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, మరొకరు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇటీవల వైసీపీ అధినేత ఢిల్లీ వేదికగా చంద్రబాబు అవినీతిపై పుస్తకం పబ్లిష్ చేస్తే దానికి పరోక్షంగా వెంకయ్య సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి వెంకయ్య నాయుడు, చంద్రబాబు మధ్య మరింత దూరం పెరిగిందనే వార్తలు వచ్చాయి.
ఇంకో విషయమేమిటంటే కేంద్ర మంత్రులతో జగన్కు వెంకయ్యే అపాయింట్మెంట్ ఇప్పించినట్లు గుసగుసలు వినిపించాయి. ఇది తెలుసుకున్న చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల సమయంలో వెంకయ్యకు టీడీపీ తరఫున టిక్కెట్ ఇచ్చేందుకు ఇష్టపడలేదని, అందుకే వెంకయ్య రాజస్థాన్ నుంచి మరోసారి రాజ్యసభకు ఎంపికయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలా ఇద్దరూ పైకి స్నేహితులుగా లోపల శత్రువులు మెలుగుతున్నారని లోకం కోడైకూస్తోంది. కాగా తాజాగా నిన్న హైదరాబాద్లో మాట్లాడుతూ పార్టీ మారిన వారు రాజీనామా చేయాల్సిందేనని బాబును ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.