Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Changing political developments in Nandyal..?

By   /  August 13, 2017  /  Comments Off on Changing political developments in Nandyal..?

    Print       Email

శిల్పా మోహన్ రెడ్డికి గట్టి షాక్..?

 

InCorpTaxAct
Suvidha

 

 

నంద్యాల ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార విపక్షాలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అలాగే వైసీపీ అధినేత జగన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇదిలాఉంటే నంద్యాల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డికి షాక్ తగిలింది.

ఆయనకు ముఖ్య అనుచరుడిగా ఉన్న కరీం సైకిలెక్కేశారు. ఆయన గత 15 ఏళ్లుగా శిల్పా మోహన్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నారు. కరీంకు కూరగాయల మార్కెట్ కమిటి అధ్యక్షుడిగా వందల మంది ఓటర్లను ప్రభావితం చేసే సత్తా ఉన్న నేతగా గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఆయన ముస్లీం ఓటర్లను ప్రభావితం చేయగలిగే నేతల్లో ముఖ్యమైన నేత అని తెలుస్తోంది. అలాంటి కరీంని టీడీపీ చేర్చుకుంది.

ఇప్పటికే నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కూడా టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.గతంలో తన గెలుపుకు కరీంబై లాంటి వాళ్ళు సహకరిస్తారని శిల్పా మోహన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించినట్లుగా సమాచారం.కూరగా యల మార్కెట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కరీంకి కండువా కప్పి మంత్రులు పార్టీలోకి ఆహ్వానించారు. కరీం చేరికతో టీడీపీ వర్గాలు ఉత్సాహంగా ఉన్నాయి. ఆయన టీడీపీలో చేరడం శిల్పా మోహన్ రెడ్డికి గట్టి షాక్ లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →