బాబు దీక్షతో ఫలితం ఉంటుందా?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 2 నుంచి నవనిర్మాణ దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. అయితే బాబు చేసే ఈ దీక్షతో ఫలితం ఎంత ఉంటుందా? కాంగ్రెస్‌ను, బీజేపీని టార్గెట్ చేస్తారా? భవిష్యత్‌లో బీజేపీపై పోరాటానికి సిద్ధమవుతారా? అంటే మాత్రం బాబు అంత త్వరగా బీజేపీ నుంచి దూరం కారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఎందుకు ఈ దీక్ష అంటే మాత్రం తన ఉనికిని కాపాడుకోసమేనని వారు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెబితే టీడీపీ ఎంపీలు.. బీజేపీ కాదు.. కాదు.. ఆంధ్రప్రదేశ్‌కు 10 ఏళ్లు కావాలని డిమాండ్ చేసిన సంగతి బాబు మరిచిపోయేరేమోనని అంటున్నారు. పైగా చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్షలో ఎవరిని విమర్శిస్తారని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. అధికారం కోసం చంద్రబాబు .. ప్రధాని నరేంద్ర మోడీ ఆడిన నాటకంలో ప్రజలు బలి అయ్యారంటున్నారు.
నవనిర్మాణ దీక్ష పెట్టి బీజేపీని విమర్శించకుండా కాంగ్రెస్‌ను విమర్శించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని, ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించాల్సింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పితే కాంగ్రెస్‌ను కాదంటున్నారు. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వమని బీజేపీ తెగేసి చెబుతున్నప్పటికీ చంద్రబాబు బీజేపీని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యమేస్తోంది. ప్రత్యేక హోదా తెస్తామని టీడీపీ.. ఇస్తామని బీజేపీ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు తమది కూడా తప్పు ఉందని తెలుసుకున్న బాబు ఆ తప్పును కప్పిపుచ్చుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని, అందుకే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆ తప్పును కాంగ్రెస్‌పై నెట్ట ప్రయత్నంలో భాగంగానే బాబు ఈ దీక్ష చేస్తున్నారని రాజకీయా విశ్లేషకులు అంటున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.