Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Chemical attacks, it is just a myth: Syria President Bashar al-Assad

By   /  April 13, 2017  /  Comments Off on Chemical attacks, it is just a myth: Syria President Bashar al-Assad

    Print       Email

bashar al-assadరసాయన దాడులు అన్నది కేవలం కల్పితం: సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్

 

InCorpTaxAct
Suvidha

 

 

 
సిరియాలో రసాయ దాడులు జరగడం అన్నది కేవలం కల్పితం మాత్రమేనని ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ అన్నారు. సిరియా తమ పౌరులపైనే రసాయన దాడులకు పాల్పడిందని అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. దీనికి ప్రతీకారంగా అమెరికా ఆ దేశ ఎయిర్ పోర్ట్ పై క్షిపణీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మొదటిసారిగా సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ స్పందించారు. రసాయన దాడులను ఆయన కొట్టిపాడేశారు.

తాను పూర్తి నమ్మకంగా చెబుతున్నానని రసాయన దాడులు అన్నది పూర్తిగా కల్పితం అని అన్నారు. వాస్తవానికి సిరియా ఆర్మీ రసాయన ఆయుధాలను ఏడాదికాలంగా అసలు ఉపయోగించలేదని అన్నారు. తాము రసాయన ఆయుధాలపై నిషేధం విధించామని చెప్పారు.ఈ మేరకు ఆయన డమాస్కస్‌లోని ఏఎఫ్‌పీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అమెరికా ఉగ్రవాదులతో సీక్రెట్ గా చేతులు కలిపిందని ఆరోపించారు. అందుకే సిరియాపై క్షిపణి దాడులకు పాల్పడుతోందని అన్నారు.ఈ మధ్యే సిరియాలోని ఇడ్లిబ్‌ స్టేట్ పై రసాయనిక దాడి జరిగింది. ఈ సందర్భంగా ఏకంగా 80 మందికి పైగా సామాన్య పౌరులు మృతి చెందారు. వీరిలో పిల్లలు కూడా ఉన్న విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →