Loading...
You are here:  Home  >  Politics  >  Delhi Politics  >  Current Article

Chhattisgarh Naxal Attacks..

By   /  February 21, 2016  /  Comments Off on Chhattisgarh Naxal Attacks..

    Print       Email

naxals in chattis ghadi2

చత్తీస్ ఘడ్ లో చెలరేగిన మావోలు..

InCorpTaxAct
Suvidha

 

చత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు మళ్ళీ చెలరేగిపోయారు. కాంకేర్‌ జిల్లా కొరార్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్థరాత్రి మైనింగ్‌ సంస్థలపై వరుస దాడులకు తెగబడ్డారు. భారీ యంత్రాలు, వాహనాలను తగులబెట్టారు. దీంతో ఖనిజ సంస్థలకు కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం ఏర్పడింది. ఆ ప్రాంతంలో ఖనిజ తవ్వకాలను మావోయిస్టులు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల కాలంలో గిరిజన ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాలు చేపట్టడం.. ఆ ప్రాంతంలో రోడ్లు వేయడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంతో మావోయిస్టుల పట్టుకునేందుకు పోలీసులకు పరోక్షంగా ఖనిజ సంస్థల నిర్వాహకులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇక్కడ ఖనిజాలను తవ్వడం నిలిపివేయాలని మావోయిస్టులు డిమాండ్‌ చేస్తున్నారు. రాత్రి సుమారు 10 భారీ వాహనాలను తగులబెట్టారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది మావోయిస్టులను అడ్డుకోడానికి ప్రయత్నించలేదు.ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఘటనా ప్రాంతాన్ని దిగ్భంధనం చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →