తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో(టి ఎ జి సి) మరియు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆట) వారి ఆద్వర్యములో చికాగో లోని ప్రవసాన్ద్రులు దసరా ఉత్సవాలు మరియు బతుకమ్మ పండుగను ఘనం గా చికాగో లోని ఆరోర వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లో జరుపుకున్నారు. పిల్లలూ పెద్దలూ అంతా కలసి 500 పైగా ఈ సంబరాలలొ పాల్గొన్నారు. ఈ సంబరాలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు అత్యంత ఉత్సాహం తో ఘనం గా జరిగాయి.
మధ్యాన భోజనం ఆరగించిన తరువాత చిన్నారులు మహిళలు సాంప్రదాయ బద్దంగా రంగు రంగుల పట్టువస్త్రాలు ధరించి అందము గ అలంకరించిన రంగు రంగుల బతుకమ్మలతో చికాగో వాసుల కన్నుల విందు చేసారు. పిల్లలు, పెద్దలు చేరి బతుకమ్మ పాటలతో సాయంత్రము వరకు ఆడి, గౌరమ్మ తల్లికి పూజ చేసి తరువాత వారి వారి బతుమ్మలను మేలా తాళాలు, భజంత్రి లతో గుడి కొలనులో ఒదిలారు. ఈ పండుగ కు ప్రక్యాత జానపథ గాయకుడు భిక్షు నాయక్ ఆకర్షన గా నిలిచి తన గీతాల తొ అందర్ని అలరించారు. బతుకమ్మ కొరకు ప్రత్యేకముగా పుష్పములను సేకరించి అలంకరంఛినారు. సుజాత అప్పలనేని, పద్మ మాదిరెడ్డి, జ్యోతి చింతలపాని ఆద్వర్యం లో అతి పెద్ద బతుకమ్మ ను చేశారు. అతిపెద్ద బతుకమ్మ ను మినహాఇంచి మిగతా బతుకామ్మల లో అందముగా అలంకరించిన బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులను పంచారు.
సాయంత్రము గుడి పూజారి అందరి తో జమ్మి వృక్షానికి మరియు ఆయుధ పూజ చేయించారు. వచ్చిన వారందరకి పూజ చేసిన కంకణాలను కట్టి ఆశీర్వదించి, ప్రసాదం పంచారు. అందరూ జమ్మి ఆకులను పంచి పెద్దల నుండి ఆశీర్వాదం తీసు కొన్నారు. ఈ వేడుకలు భారత దేశం లోని దసరా ఉత్సవాలని మరిపించాయని పలువురు ప్రశంసించారు.
తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో (టి ఎ జి సి ) అద్యక్షులు శ్రీనివాస్ పెదమల్లు ఆటా(ఆట ) అద్యక్షులు కరుణాకర్ మాధవరం, ఈ వేడుకకు విచ్చేసిన ఆతిథులకు, ధాతలకు, కార్యకర్తల కు ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమానికివిచ్చేసిన BJP నాయకులుశేఖర్జికి ప్రత్యెకప్రత్యేకధన్యవాదములుతెలిపారు. ఈ బతుకమ్మ, దసరా సంబరాలకు విందు భోజనాలను సమకూర్చిన కూల్ మిర్చి, స్వీట్స్ స్పాన్సర్ చేసిన శ్రీనివాస్ చాడా కుటుంబానికి, పూజా ఫలాలు స్పాన్సర్ చేసిన సర్యామిక్ ఫ్రెష్ మార్కెట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేశారు.
ఈ వేడుక విజయవంతం కావడానికి అహర్నిశలు కృషిచేసిన జగన్ బుక్కరాజు, రామ్ అదే, హరి రైనీ, రాఘవ జెట్ల, సత్య కందిమళ్ళ, కల్యాణ్ ఆనందుల, శ్రీనివాస్ మట్ట , శ్రీనివాస్ సరికొండ, నరేందర్ చీమర్ల మరియు ఇతర కార్యవర్గ సబ్యులను అభినందించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.