పాక్ తో కలిసి ఆయుధాల తయారీకి చైనా యోచన..
భారత్ ఎదుగుదలను చైనా సహించలేకపోతోంది. దీంతో భారత్ తో తనకు హాని ఉందని భావిస్తున్నట్లుంది. దీంతో పాక్ తో కలిసి తన రక్షణ బంధాన్ని మరింత మెరుగుపరచుకోవాలని భావిస్తోంది. పాకిస్తాన్ తో కలిసి బాలిస్టిక్, క్రూయిజ్ విమాన, నౌకా విధ్వంసక క్షిపణులు, యుద్ధ విమానాలను నిర్మించాలని చైనా భావిస్తున్నట్లుగా చైనాకు చెందిన మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. లాస్ట్ ఇయర్ భారత్ అగ్ని క్షిపణిని పరీక్షించింది. దీంతో చైనా పైవిధంగా ప్లాన్ చేసినట్లుగా పేర్కొంది.
ఇక పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ క్వామర్ జావెద్ బజ్వా ఈ మధ్య చైనాలో పర్యటించారు. అలాగే ఆ దేశ సైనిక అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిమధ్య పై ఆయుధాల ఉత్పత్తికి సంబంధించిన అంశాల గురించి చర్చ జరిగిందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ట్యాంకర్లు, ఎఫ్సీ-1 జియావోలాంగ్ బహుళ ప్రయోజన యుద్ధవిమానం వంటి వాటిని పాకిస్థాన్లో ఉత్పత్తి చేసేందుకు చైనా అనుమతించే అవకాశం ఉందని పేర్కొంది.ఇక పాకిస్తాన్ తన రక్షణ అవసరాల కోసం చైనాను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే.
ఇక చైనా సహకారం అందిస్తున్నందుకు పాక్ చైనా-పాక్ ఆర్ధిక నడువాకు భద్రత కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఏకంగా 15 వేల మంది సైనికులు ఏర్పాటు చేసింది. అలాగే నేవి పరంగా కూడా ప్రత్యేక ఫోర్స్ ఏర్పాటు చేసింది.ఈ విషయాన్ని చైనాలో పాక్ రాయబారి మసూద్ ఖలీద్ తెలిపారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.