తెలుగు రాష్ట్రాలకు స్పేస్ల్యాబ్ గండం ఉందా?
* అలర్ట్గా ఉండాలని శాస్త్రవేత్తల హెచ్చరికలు
డెక్కన్ అబ్రాడ్: తెలుగు రాష్ట్రాలకు చైనా గండం పొంచివుందా? అంతరిక్షంలో గతి తప్పిన చైనా ల్యాబ్ టియాంగోన్గ్-1 ఇండియాలో కూలేందుకు అవకాశాలున్నాయా? ఇందుకు ఖగోళ నిపుణులు కచ్చితంగా సమాధానం చెప్పలేకున్నా.. అది మన నడి నెత్తిపైనే తిరుగుతున్న మాట వాస్తవమేనని తెలుపుతున్నారు. ప్రస్తుతం భూమిచుట్టూ తిరుగుతున్న ఈ స్పేస్ల్యాబ్ దిశ మార్చుకుంది. ఇంకా భూ వాతావరణంలోకి ప్రవేశించని ఈ స్పేస్ ల్యాబ్ ఇప్పటివరకు ఉత్తర చైనా, ఇటలీ, ఉత్తర స్పెయిన్, మిడిల్ ఈస్ట్, న్యూజిలాండ్, తస్మానియా, దక్షిణ, ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా మీదుగా సాగిన స్పేస్ ల్యాబ్ ప్రాంతాలు మీదుగా సంచరించింది. రెండు రోజుల నుంచి దీని దిశలో మార్పు కనిపిస్తోంది.
ఇప్పుడు అది ఇండియాలోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా ప్రయాణిస్తోంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఉత్తర, దక్షిణా అమెరికా మీదుగా సాగుతోంది. ఇది ఏప్రిల్ 1, లేదా 2వ తేదీల్లో భూమిపై కూలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని గమనాన్ని శాట్వ్యూ అనే ఉపగ్రహ ట్రాకింగ్ వెబ్సైట్ గమనిస్తోంది.
చైనా స్పేస్ ల్యాబ్ టియాంగోన్గ్-1 కదలికలను లైవ్లో చూడాలనుకుంటే క్రింద పేర్కొన్నలింక్ను క్లిక్ చేయండి.
http://www.satview.org/?sat_id=37820U
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.