Loading...
You are here:  Home  >  Defense & Space  >  Current Article

Chinese Journalists Expelled By Modi Govt

By   /  July 25, 2016  /  Comments Off on Chinese Journalists Expelled By Modi Govt

    Print       Email

Narendra-Modi-PTI2మోడి ఏం చేశారో తెలుసా?

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్థాయి వంటి వ్య‌క్తి అలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌చ్చా? ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు దేశానికి మేలు చేకూర్చేవేనా?  అంటే ఎక్కువ మంది అవున‌నే అంటున్నా… కొంత‌మంది మాత్రం ఆయ‌న నిర్ణ‌యాలను త‌ప్పుబ‌డుతున్నారు. ఇంత‌కీ విష‌య‌మేమిటంటే..అరుణాచల్ ప్రదేశ్ భూభాగం… సరిహద్దుల్లో చొరబాట్లు.. ఇతర అంశాలపై తరచూ చైనా మీడియాలో భారత్ కు వ్యతిరేకంగా కథనాలొస్తున్న నేప‌థ్యంలో  భారత్ లో పనిచేస్తున్న ముగ్గురు చైనా జర్నలిస్టులను ప్రధాని మోడీ ఇండియా నుంచి బహిష్కరించడం సంచలనంగా మారింది. చైనాకు చెందిన అధికార న్యూస్ ఏజన్సీ ‘క్సిన్హువా’ తరఫున ఇండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను దేశం నుంచి వెళ్లిపోవాలని మోడీ సర్కారు ఆదేశించింది. వీరు ముగ్గురూ దేశ  భద్రతాంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని నిఘా వర్గాలు పసిగట్టడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

InCorpTaxAct
Suvidha

కాగా  చైనా జర్నలిస్టులకు దేశ బహిష్కరణ శిక్ష విధించడం ఇదే తొలిసారి. వీరి కదలికలపై నిఘా పెట్టిన అధికారులు – ఓ నివేదికను ఇవ్వగా దీన్ని పరిశీలించిన హోం శాఖ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. కాగా ఈ ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల వీసా గడువు ముగిసిపోగా దాన్ని పొడిగించుకుని ఇండియాలో ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. విలేకరుల బహిష్కరణపై చైనా విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు. అయితే.. దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో ఇంకా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ పొరుగుదేశంతో ఘర్షణలు పెంచుకోరాదన్న సదుద్దేశంతోనే మోడీ వీరిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారని తెలుస్తోంది. లేదంటే ఇంకా కఠిన శిక్షలు వేయడానికి అవకాశం ఉండేది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →