నెపోలియన్ గా మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా సస్పెన్స్ ఒక్కొక్కటిగా వీడుతున్నాయి.ఇప్పటికే ఈ సినిమాకి కత్తిలాంటోడు అనే టైటిల్ కాదని రాంచరణ్ ఫేస్బుక్ లో ప్రకటించాడు.అయితే ఈ సినిమా ఆఫీషియల్ టైటిల్ ని చిరు ఫేస్బుక్ పేజీ ద్వారా రిలీజ్ చేశారు. ప్రతిష్టాత్మ 150 వ సినిమాకి నెపోలియన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. నెపోలియన్ అనగానే మనకు గుర్తొచ్చేది చరిత్రలో ఓ గొప్ప పోరాట యోధుడు,ప్రజా చైతన్యానికి పునాది వేసిన గొప్ప విప్లవ వీరుడు.సరిగ్గా ఇలాంటి లక్షణాలే చిరు ఈ సినిమాలో హీరో పాత్రలో ఉండడంతో నెపోలియన్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది.సినిమా ఆద్యంతం రైతులు,ఆత్మహత్యలు,వారి కోసం హీరో పోరాటాలు,ల్యాండ్ మాఫియా వంటి అంశాలతో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా నడుస్తుందనే విషయాన్ని చెప్పకనే పోస్టర్లో చెప్పేసారు.
పోస్టర్ని దగ్గరగా గమనిస్తే మనకి అర్థం అవుతుంది.ఓ వైపు చిరంజీవి..మరో వైపు బ్యాక్ గ్రౌండ్ లో నాగలి దున్నుతూ రైతు ఉండగా,చిరు ముఖం పై ‘భూ’భత్సం , రైతు ఆత్మహత్యలు, ల్యాండ్ మాఫియా,తొమ్మిది మంది రైతులు అని మనకు కనిపిస్తుంది. ఇది చాలు ఈ సినిమా కి ఏ రేంజ్ లో బాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారో చెప్పడానికి.ప్రతి విషయం లోను ఎంతో కేర్ తీసుకుని చిత్ర యూనిట్ మొత్తం మెగాస్టార్ చిరంజీవికి, మెగాస్టార్ అభిమానులకి కలకాలం గుర్తుండి పోయేలా చిరు 150 వ సినిమా వుండబోతోంది అనడం లో ఎటువంటి సందేహం లేదు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.