Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chiranjeevi

By   /  August 2, 2016  /  Comments Off on Chiranjeevi

    Print       Email

sankarశంక‌ర్‌దాదా సిరీస్‌లో చిరునే హీరో

 

InCorpTaxAct
Suvidha

 

 

మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లో న‌టిస్తున్నారు. ఈసారి వ‌రుస సినిమాల‌తో త‌న సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళ్లితే బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ హీరోగా ‘మున్నాభాయ్‌’ సిరీస్‌లో మూడో సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమా కాకుండా ఇంకో మూడు సినిమాలకు సంజయ్‌దత్‌ సైన్‌ చేశాడని సమాచారం. ‘మున్నాభాయ్‌’ సిరీస్‌ తెలుగులోకి రీమేక్‌ అయ్యింది చిరంజీవి హీరోగా. తొలి సినిమా ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ పెద్ద విజయం సాధించగా, రెండోది ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ అంచనాల్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ సినిమా కూడా ఒక సంచలనమే. అయితే చిరంజీవిని మాస్‌ ప్రేక్షకులు గాంధీగిరిలో చూడలేకపోయారంతే. అక్కడ మున్నాభాయ్‌ మూడో సినిమా పట్టాలెక్కితే, వెంటనే ఆ సినిమా రైట్స్‌ని కొనుగోలు చేసేందుకు చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ సిద్ధంగా ఉన్నాడని తెలియవస్తోంది.

ప్రస్తుతం చిరంజీవి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వస్తోన్న ‘కత్తిలాంటోడు'(వర్కింగ్‌ టైటిల్‌) సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత పూరీ డైరెక్షన్‌లో సినిమా చేయాల్సి ఉంది చిరంజీవి. ఈ రెండు సినిమాలు పూర్తయ్యేసరికి అక్కడ ‘మున్నాభాయ్‌ సిరీస్‌’ లైన్‌లోకి వచ్చేయడం గ్యారంటీ. అంటే త్వరలోనే చిరంజీవి నుండి మరో ‘శంకర్‌దాదా సిరీస్‌ రానుందన్న మాట.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →