చిరు అభిమానులకు చెర్రీ గిఫ్ట్..
మెగాస్టార్ చిరంజీవి రీ కత్తి రీమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ ‘ఖైదీ నంబర్ 150’. కాజల్ హీరోయిన్ గా చిరు పక్కన నటిస్తోంది. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చిరు బర్త్ డే సందర్భంగా.. సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
చిత్ర బృందాన్ని, తోటతరణి, రత్నవేల్, దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు వి.వి.వినాయక్‌లను ఈ వీడియోలో పరిచయం చేశారు. ‘బాస్ ఈజ్ బ్యాక్’ హ్యాపీబర్త్‌డే మెగాస్టార్ అంటూ విడుదల చేసిన ఈ వీడియో అభిమానులను అలరిస్తోంది. మెగాస్టార్ అభిమానులు ఈ వీడియో పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.