Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

`క‌త్తి`గా దూసుకొస్తున్న మెగాస్టార్‌!

By   /  April 29, 2016  /  Comments Off on `క‌త్తి`గా దూసుకొస్తున్న మెగాస్టార్‌!

    Print       Email

chiruమెగాస్టార్ చిరంజీవి అభిమానుల‌కు ఈ రోజు పండుగ రోజు అని చెప్ప‌వ‌చ్చు. చిరు 150వ సినిమా అస‌లు వ‌స్తుందా? రాదా? అన్న అనుమానాల‌కు చిరంజీవి తెర‌దించారు. అంతేకాదు `క‌త్తి`లాగా దూసుకు వ‌స్తున్నాడు. ‘కత్తిలాంటోడు’ టైటిల్‌తో వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మెగా చిత్రం శుక్రవారం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిరు తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరు 150వ చిత్రం సందర్భంగా ఈ కొణిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌ను చిరు భార్య సురేఖ శుక్రవారం లాంఛ్ చేశారు. ప్రముఖ రచయత పరుచూరి వెంకటేశ్వరరావు ఈ చిత్రానికి క్లాప్ కొట్టగా…నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విఛాన్ చేశారు. నాగబాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ మెగా కార్యక్రమానికి అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నాగబాబు, నిహారిక, అల్లు అరవింద్‌తో సహా మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. వీరితోపాటు దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు శరత్ మారర్, డివివి.దానయ్య, పరుచూరి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కెమెరామెన్ కాగా..రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →