Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

వాళ్లిద్ద‌రూ క‌లిసి పోయారా?

By   /  April 23, 2016  /  Comments Off on వాళ్లిద్ద‌రూ క‌లిసి పోయారా?

    Print       Email

chiranjeevi - Balakrishnaసినిమా ఇండ‌స్ట్రీలో కొన్ని రోజులుగా చిరంజీవి, బాల‌కృష్ణ మ‌ధ్య అంత‌ర్గ‌త పోరు న‌డుస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అంతేకాదు రాజ‌కీయంగా ఇద్ద‌రూ వేర్వేరు పార్టీలు కావ‌డం.. ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటుండ‌డాన్ని వారి మ‌ధ్య మ‌రింత దూరం పెరిగింద‌నేది ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. అయితే బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ సినిమా గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి సినిమాకు సంబంధించిన ఆహ్వాన ప‌త్రిక‌ను బాల‌కృష్ణ  చిరంజీవికి పంపించారు. దీంతో చిరంజీవి ఆ వేడుక‌లో పాల్గొని బాల‌కృష్ణ‌ను ఆకాశానికి ఎత్తారు. గౌతమీ పుత్ర శాతకర్ణి సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటుంద‌న్నారు.  100వ సినిమా చాలా ప్రతిష్టాత్మకమని, మైలు రాయిగా ఉండిపోతుందని చెప్పారు.

బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి చరిత్రను సినిమా కథగా నిర్ణయం తీసుకోవడమే తొలి విజయం అని చెప్పారు. బాలకృష్ణ జీవిత చరిత్రలో ఇది అపూర్వ ఘట్టంగా ఉంటుందని అన్నారు. ఈ సినిమా బాధ్యత క్రిష్ కు ఇచ్చారంటేనే దాదాపు విజయం ఖాయమైనట్లేనని, సరైన దర్శకుడు క్రిష్ అని చెప్పారు. ఎలాంటి పాత్రనైనా బాలకృష్ణ చేస్తారని ఈ పాత్రలో మాత్రం మరింత ఒదిగిపోతారని చెప్పారు. ఈ పొగ‌డ్త‌ల‌ను చూసిన స‌గ‌టు ప్రేక్ష‌కుడు, ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు బాల‌కృష్ణ‌, చిరంజీవి క‌లిసిపోయిన‌ట్లేన‌ని భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →