గేల్‌కు ఇక కష్టకాలమే!
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ తన ఆదాయానికే తానే గండి కొట్టుకుంటున్నాడు. అతనితో ఒప్పందాలు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోగా ఉన్న వాటిని కూడా కోల్పుతున్నాడు. దీనికంతటికీ గేల్ ప్రవర్తనే కారణంగా తెలుస్తోంది. ఇటీవల మహిళా జర్నలిస్టులతో ఇంటర్యూల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం కారణమని సమాచారం. కాగా క్రిస్ గేల్‌కు ఆస్ట్రేలియన్ క్రికెట్ టోర్నీ బిగ్‌బాష్ లీగ్‌తో బంధానికి తెరపడినట్లుగా కనిపిస్తోంది. బిగ్‌బాష్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టు తరుఫున ఆడుతున్న గేల్‌తో కాంట్రాక్టును పునరుద్ధరించుకోవడానికి ఆ జట్టు సిద్ధంగా లేదని, రెనెగేడ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టూవర్ట్ కోవెంట్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది సమ్మర్లో జరిగే బిగ్‌బాష్ లీగ్‌కు తమ జట్టుతో కాంట్రాక్టుకు గేల్‌తో సంతకం పెట్టించుకోలేదని కోవెంట్రీ తెలిపారు.
బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా ఆస్ట్రేలియా మహిళా జర్నలిస్టుకిచ్చిన ఇంటర్వ్యూలో తనతో డేట్‌కు వస్తావా అంటూ గేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని ఆసీస్ మాజీలతోపాటు తాజా క్రికెటర్లలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. గేల్‌ను పూర్తిగా బిగ్‌బాష్ నుంచి బహిష్కరించాలంటూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయినా కూడా మారని గేల్, ఇటీవల ఐపీఎల్లో ఓ బ్రిటిష్ మహిళా జర్నలిస్టుతో ఇంటర్వ్యూలోనూ సెక్స్‌కు సంబంధించి వెకిలి వ్యాఖ్యలు చేసి తన పరువు పోగొట్టుకున్నాడు. దీంతో ఇంగ్లీష్ కౌంటీల్లోనూ గేల్‌కు దారులు మూసుకుపోతున్నట్లు సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.