Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

chris gayle

By   /  May 22, 2016  /  Comments Off on chris gayle

    Print       Email

Chris Gayleవివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ క్రిస్‌గేల్‌

 

InCorpTaxAct
Suvidha

 

 

క్రికెట్‌లో విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న క్రిస్‌గేల్ వివాదాల్లో కూడా అంతే పాపుల‌ర్ అవుతున్నాడు. నోటికి ఎంత‌మాట వ‌స్తే అంత మాట అనేస్తున్నారు. మ‌హిళ‌ల‌తో అస‌భ్య‌క‌రంగా మాట్లాడుతూ వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఆ మధ్య బిగ్ బాష్ టీ20 లీగ్ మ్యాచ్ సందర్భంగా తనను ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ను పట్టుకుని షికారుకెళ్దాం వస్తావా అంటూ మొహమాటం లేకుండా అడిగేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న గేల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. బ్రిటిష్ దినపత్రిక ‘ద టైమ్స్’ మహిళా జర్నలిస్టు చార్లెట్ ఎడ్వర్డ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  నువ్వు ఎప్పుడైనా త్రీసమ్ చేశావా (ముగ్గురు కలిసి శృంగారంలో పాల్గొనడం) అని రివర్స్ లో క్వశ్చన్ అడిగి సంచలనం సృష్టించాడు గేల్. అంతటితో ఆగకుండా నాది చాలా పెద్ద బ్యాట్ అంటూ డబుల్ మీనింగ్ డైలాగులు కూడా పేల్చాడు.

నువ్వెప్పుడైనా నల్లజాతి మగాళ్లతో శృంగారానికి పాల్పడ్డావా.. నాకు తెలుసు – నువ్వు కచ్చితంగా చేసే ఉంటావ్ అని కూడా ఆమెతో వ్యాఖ్యానించాడు గేల్. ఇక ఈ ఇంటర్వ్యూలో మహిళల మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు గేల్. మహిళలు మగాళ్ల కన్నా ఎక్కువగానే ఎంజాయ్ చేస్తున్నారని.. తమ దేశంలో సెక్స్ అనేది రిలాక్స్ కోసమనే భావముందని అతనన్నాడు. జమైకా మహిళలు దృఢంగా ఉంటారని.. వాళ్లకు ఏదైనా కావాలనిపిస్తే ఏమాత్రం మొహమాటపడరని అన్నాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →