Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా

By   /  April 26, 2016  /  Comments Off on చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా

    Print       Email
Toorpuvellerailu
చిత్రం–తూర్పు వెళ్ళే రైలు(1979)రచన–ఆరుద్ర,సంగీతం,గానం–బాలు
విశేషం–ఆరుద్ర ఇద్దరి సినిమాలకు చక్కని పాటలను రాస్తాడు. వారు దర్శకుడు కే.బీ. తిలక్ ,బాపురమణలు. బహుశా:వారంటే ఆరుద్రకు అభిమానం ఎక్కువ ఉండొచ్చు,లేదా వాళ్ళు ఈయనకు పూర్తి స్వాతంత్రాన్ని ఇచ్చి ఉండొచ్చు!ఆరుద్ర ప్రత్యేకత అంత్య ప్రాసలు.ప్రియురాలు ఏ చీర కట్టుకున్నా బాగుంటుందని ప్రియుడు కవితాత్మకంగా చెప్పటం ఈ పాటలోని ప్రత్యేకత.తూర్పు వెళ్లే రైలు 1979లో విడుదలైన ఒక తెలుగు సినిమా. భారతీరాజా తమిళచిత్రం ‘కిషక్కు పోగుం రైల్’ చిత్రానికి తెలుగురూపం ఈ సినిమా. ఇది బాపు రమణల అనుసృజన. బాలసుబ్రహ్మణ్యం సంగీతదర్శకునిగా పనిచేసారు.ఈ సినిమాలో 5 పాటలను ఆరుద్ర రచించారు. సినిమా బాపు అభిమానులను అలరించింది.    
*****
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
బొట్టూ కాటుక పెట్టీ నే కట్టే పాటను చుట్టీ
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మా
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
తెల్ల చీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మా
నల్లచీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మా
ఎఱ్ఱచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా
పచ్చచీర కట్టుకుంటే పంటచేను సిరివమ్మా
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
నేరేడు పళ్ళరంగు జీరాడే కుచ్చిళ్ళు
ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు
వంగపండు రంగులోన పొంగుతాయి సొగస్సుల్లూ
వన్నె వన్నె చీరల్లోన నీ ఒళ్ళే హరివిల్లు
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
బొట్టూ కాటుక పెట్టీ నే కట్టే పాటను చుట్టీ
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మా
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా 
ఈ పాటను ఇక్కడ https://www.youtube.com/watch?v=p0OxTC6W5pU వినండి!
టీవీయస్.శాస్త్రి 
TVS SASTRY  
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →