ట్రంప్ ను వెనక్కు నెట్టిన హిల్లరీ..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రటిక్ పార్టీ తరపున హిల్లరీ క్లింటన్.. రిపబ్లికన్ పార్టీ తరపున డోనాల్డ్ ట్రంప్ బరిలో నిలిచారు. ఇద్దరి మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. అయితే రోజు రోజుకు అమెరికాలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. తాజా సర్వేల ప్రకారం హిల్లరీ.. ట్రంప్ ను దాటేసి ముందుకు దూసుకుపోతున్నారని సమాచారం. దీనికి కారణం ట్రంప్ నోరు పారేసుకోవడమేనని తెలుస్తోంది.
ఇక హిల్లరీకి 48 శాతం మంది మద్దతు ఉంది. అదే ట్రంప్ కు అయితే కేవలం 33 శాతం మందికి ఓటర్లు మద్దతు ఉన్నట్లుగా మెక్ క్లాచీ-మారిస్ట్ పోల్ సర్వే ప్రకారం తెలుస్తోంది. ఇదే సంస్థ గతంలో నిర్వహించిన సర్వేలో హిల్లరీకి 42 శాతం మద్దతు రాగా.. ట్రంప్ కు 39 శాతం మద్దతు వచ్చింది. అయితే రీసెంట్ గా నిర్వహించిన సర్వేలో ట్రంప్ మరింతగా దిగజారారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన సర్వే ప్రకారం హిల్లరీ.. డోనాల్ట్ ట్రంప్ కంటే 9 పాయింట్ల ఆధీక్యంలో ఉన్నారు. ఇదే సంస్థ గతంలో నిర్వహించిన సర్వేలో హిల్లరీ ఐదు పాయింట్ల ఆధీక్యంలో నిలిచారు.ఈ సర్వేల ప్రకారం ట్రంప్ కు మద్దతు పడిపోయిందని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలు, ఆఫ్రికన్స్, యువత, గ్రాడ్యుయేట్స్ సహా పలువురు ఓటర్ల నుంచి హిల్లరీకి మద్దతు లభిస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.