అభివృద్ధి చూసి ఓర్వలేక విషం చిమ్ముతున్నారు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఏపీ ఆర్ధిక వ్యవస్థకు అమరావతి మూలస్తంభంలా నిలవాలని కృషి చేస్తుంటే కొంత మంది అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా కోటప్పకొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అవినీతి సొమ్ముతో పత్రిక పెట్టారని వైసీపీపై పరోక్ష విమర్శలు చేశారు.
ఈడీ అటాచ్ చేసిన పత్రిక అమరావతిపై విషం కక్కుతోందని అన్నారు. డబ్బు పిచ్చితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. ఇంకా నాశనం చేయాలని చూస్తున్నారని అన్నారు. అలాంటి వారిని వదిలిపెట్టేది లేదని పరోక్ష విమర్శలు చేశారు. సభలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఉన్నారని.. ఆయన ముందు రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదని.. మరోసారి వచ్చినప్పుడు అన్నీ మాట్లాడుతానని అన్నారు. నీతి, నిజాయితీగా పని చేస్తున్న తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికలో రాసే అలాంటి రాతలను ప్రజలే తిప్పి కొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధానిలో భూముల విషయంపై ఓ పత్రికలో వచ్చిన కథనాలను ముఖ్యమంత్రి తప్పుబట్టారు. వారి పత్రికను ఈడీ అటాచ్ చేసినట్లుగా.. హాయ్‌లాండ్‌ను ఏపీ సర్కారు అటాచ్ చేస్తే వాటిని తమ కుటుంబ సభ్యులు కొని.. రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా ఎలా రాస్తారని మండిపడ్డారు. బినామీల పేరు మీద భూములు ఇచ్చారనడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.