Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

CM Chandra Babu is spending crores when AP is struggling – YS Jagan

By   /  June 17, 2016  /  Comments Off on CM Chandra Babu is spending crores when AP is struggling – YS Jagan

    Print       Email

jagan - babuబాబు జ‌గ‌న్‌కు భ‌య‌ప‌డ్డారా?

 

InCorpTaxAct
Suvidha

 

“ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జా ధ‌నాన్ని నీళ్ల‌లా ఖ‌ర్చు చేస్తున్నాడు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూనే వేల కోట్లు దుబారా చేస్తున్నాడు. అంద‌రికీ ఆద‌ర్శంగా ఉండాల్సిన ముఖ్య‌మంత్రి ఇలా చేస్తే ఎలా?“ అని ప్ర‌తిప‌క్షాలు బాబుపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా 26 కిలోమీట‌ర్ల‌కు కూడా హెలీకాఫ్ట‌ర్ వాడ‌డం పెద్ద చ‌ర్చ‌నీయాంశమైంది. ఈ విష‌యమై సోసియ‌ల్ మీడియాలో కూడా బాబుపై జోకులు పేలుతున్నాయి. అవి ఏంటంటే ఇటీవ‌ల ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రైతు భ‌రోసా యాత్ర‌లో మాట్లాడుతూ ఎన్నిక‌ల ముందు ఇచ్చిన వాగ్దానాల‌ను నెర‌వేర్చ‌ని చంద్ర‌బాబుకు ఎక్క‌డ క‌నిపిస్తే అక్క‌డ చెప్పులు, చీపుర్లు చూపించ‌డండి అని ప్ర‌జ‌ల‌కు పిలుపునివ్వ‌డం వ‌ల‌నే సీఎం ఆకాశంలో తిరుగుతున్నాడ‌ని జోకులు వేసుకుంటున్నారు. నేల‌పై తిరిగితే ప్ర‌జ‌లు ఎక్క‌డ తిర‌గ‌బ‌డి చెప్పులు.. చీపుర్లు చూపిస్తారో అని భ‌య‌ప‌డే విహంగ యాత్ర‌లు చేస్తున్నారంటున్నారు.
ఒక‌వేళ జ‌గ‌న్‌కు, ప్ర‌జ‌ల‌కు భ‌య‌ప‌డ‌క‌పోతే ఎందుకు నేల‌పై ప్ర‌యాణాలు చేయ‌డం లేదో ప్ర‌జ‌ల‌కు బాబు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయ‌ని చంద్ర‌బాబు చెబుతారు కానీ ఆయ‌నే పాటించ‌రంటున్నారు. రాజ‌ధాని నుండి 26 కిలోమీట‌ర్ల దూరం గుంటూరు జిల్లా ఆత్కూరు గ్రామానికి వెళ్లేందుకు హెలికాఫ్ట‌ర్‌ను ఉప‌యోగించ‌డంపై ప‌లువిమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఏది ఏమైనా జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు ఇచ్చి పిలుపు వ‌ల్లే బాబు భ‌య‌ప‌డుతున్నాడ‌ని అక్క‌డి స్థానికులు అనుకోవ‌డం క‌నిపించింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →