గంటాపై సీఎం సీరియస్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రుల పనితీరుపై ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వాళ్లపై సీరియస్కూడా అవుతున్నారు. మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుపై . మొన్నీమధ్య విజయవాడలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు… విద్యాశాఖలో బదిలీలు ఎంతవరకు వచ్చాయని గంటాను ప్రశ్నించారట. అయితే ఒక ఉన్నతాధికారి విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఈ ప్రక్రియ కొంత ఆలస్యమవుతోందని గంటా సమాధానం ఇచ్చారట. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు… పాఠశాలలు తెరుచుకుని ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా ఈ ప్రక్రియ చేపట్టకపోవడం ఏంటని గంటాను నిలదీశారట. అంతేకాదు ఈ విషయం తాను గుర్తుచేసే వరకు తన దృష్టికి తీసుకురాకపోవడంపైనా ఆయన గంటాకు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. ఇలాంటి క్లాసులు మంత్రి గంటాకు కొత్తకాదు! ఆ మధ్య జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు గంటా ఇచ్చిన ఫైల్ ను చూడకుండానే విసిరేశారని వార్తలు వచ్చాయి.
ఆ తరువాత కూడా గంటా శ్రీనివాసరావు పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగానే ఉన్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. గంటా పరిస్థితి ఇలావుంటే రేపోమాపో చేపడతారని భావిస్తున్న మంత్రివర్గంలో ఆయనకు ఉద్వాసన తప్పదనే ఊహాగానాలు మొదలవడం గమనార్హం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.