Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

CM Chandra Babu opposed YSRCP leaders comments..

By   /  March 20, 2017  /  Comments Off on CM Chandra Babu opposed YSRCP leaders comments..

    Print       Email

chandrababu naiduడబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో ప్రజలకు తెలుసు: సీఎం చంద్రబాబు నాయుడు

 
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. దీంతో విపక్ష పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. భారీగా డబ్బు ఖర్చు చేసి చంద్రబాబు ఓట్లను కొనుగోలు చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. తాము అభ్యర్ధుల్ని కొనుగోలు చేశామని ప్రతిపక్ష నేత అంటున్నారని అన్నారు. వాస్తవానికి డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వైసీపీ గుర్తింపే రాలేదని అన్నారు. అలాంటప్పుడు ప్రజా ప్రతినిధులు తమ వాళ్లని జగన్ ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగా సాగుతాయని జోస్యం చెప్పారు.

InCorpTaxAct
Suvidha

కనీసం ఖర్చులకు, అంచనాలకు తేడా తెలియని స్థాయిలో ప్రతిపక్షనేత ఉన్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. జగన్‌ తెలియని దాన్ని ఏ మాత్రం నేర్చుకునే ప్రయత్నం చేయరని అన్నారు. కనీసం చెప్పినా కూడా వినరని అన్నారు. పులివెందులలో పోటీ చేయాలన్న జగన్‌ సవాల్‌పై సీఎం స్పందించారు. 2019లో పులివెందుల స్థానం టీడీపీదేనని అన్నారు. ప్రజలు కోరుకుంటున్నది అభివృద్ధి, సంక్షేమం, ఆనందం అని అన్నారు. వాటిని తాను అందిస్తున్నానని చెప్పారు. అలాంటప్పుడు మరో పార్టీతో ప్రజలకు పనే లేదని అన్నారు. జగన్ ఏకంగా ఏడాది పాటు జైలుకు వెళ్ళిన చరిత్ర ఉందన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →