Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

CM Chandrababu fires on Jagan in 10th exam paper leaked issue..

By   /  March 30, 2017  /  Comments Off on CM Chandrababu fires on Jagan in 10th exam paper leaked issue..

    Print       Email

cm-chandrababuప్రతిపక్ష నేత కాకపోయి ఉంటే జగన్ ఉగ్రవాది మాత్రమే: సీఎం చంద్రబాబు నాయుడు

 

InCorpTaxAct
Suvidha

 

 

తమ సర్కారు పదో తరగతి పరీక్షల్లో జంబ్లింగ్ పద్ధతిని తీసుకొచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పదో తరగతి పేపర్ లీకేజీపై విపక్షం చేసిన ఆరోపణలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ ఎప్పుడూ పరీక్షలు రాయలేదేమో అంటూ విమర్శించారు. అసలు జంబ్లింగ్ అంటే మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. సత్యం రామలింగరాజు, సుబ్రతారాయ్, హర్షద్ మెహతా వంటివారు ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని అన్నారు. జగన్ కూడా వీరి కోవలోకి చెందిన వారేనని అన్నారు. ప్రతిపక్ష నేత కాకపోయి ఉంటే జగన్ పోలీసుల దృష్టిలో ఉగ్రవాది, ఆర్ధిక నేరస్థుడు గానే మిగిలి ఉండేవారని అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదాని నోటికొచ్చినట్లుగా మాట్లాడటం సబబు కాదన్నారు.

పరీక్ష పేపరు లీకేజీ వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదన్నారు. నారాయణ స్కూల్ హస్తం ఉందని తేలితే వారిపై కూడా చర్యలు తీసుకుంటానని తేల్చి చెప్పారు. అదే స్టింగ ఆపరేషన్ అని తేలితే జగన్ పేపర్ పై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఈ విషయం వెనుక ఎవరున్నా వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. చెప్పే మాటలు సమస్యల పరిష్కరించే విధంగా ఉండాలని అన్నారు. అంతేతప్ప తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. జబ్లింగ్ అంటే ఓ స్కూల్ చదివే పిల్లలను విభజించి నాలుగైదు స్కూళ్ళకు పరీక్షలు రాసేందుకు పంపుతారని అన్నారు. ఇక ఇన్విజిలేటర్లను కూడా జబ్లింగ్ విధానంలో వేశామని చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →