విపక్షంపై చంద్రబాబు సెటైర్లు..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విపక్షాలపై ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వస్తాయని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ఆయన గుంటూరు జిల్లాలో విద్యార్ధులతో ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు వ్యాఖ్యానించారు. విపక్షం స్పెషల్ స్టేటస్ పై తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా చదువు గురించి మాట్లాడారు.
తాను తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో ఎకనమిక్స్ చదివానని అన్నారు. మరి ప్రతిపక్ష నేతలు ఎక్కడ చదివారో చెప్పాలన్నారు. అలాగే వారు ఏం చదివారో తనకు తెలియదన్నారు. అసలు ఏ రూల్స్ కింద ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్షాన్ని ఈ విషయం గురించి చాలాసార్లు అడిగానని చెప్పారు. అయితే వారు సమాధానం చెప్పకుండా సైలెన్స్ పాటిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ఏ నిబంధనల ప్రకారం స్పెషల్ ఇన్సెంటివ్స్ వస్తాయో చెప్పాలన్నారు.అప్పుడు వాటి గురించి తాము కూడా పోరాటం చేస్తామన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.