Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

CM Chandrababu told about Vamsadhara project…

By   /  January 1, 2018  /  Comments Off on CM Chandrababu told about Vamsadhara project…

    Print       Email

గత ఏడాది అన్ని రంగాల్లో ప్రగతి సాధించాం: సీఎం చంద్రబాబు

 

InCorpTaxAct
Suvidha

 

 

గత ఏడాది అన్ని రంగాల్లో ఏపీ ప్రగతి సాధించిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా సమస్యలను అధికమించగలిగామని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళంలో వంశధార ప్రాజెక్ట్ కు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని అన్నారు. తాము ఒక్కో సమస్యను జాగ్రత్తగా అధిగమిస్తున్నామని చెప్పారు. ప్రజల కోసం ఎన్నో చేస్తున్నామన్నారు. అయినా కూడా తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారని అన్నారు. వారు వేలాది మంది పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లుతున్నారని మండిపడ్డారు.

ప్రకాశం జిల్లా దర్శిలో ఐదో విడత జన్మభూమిని ప్రారంభిస్తామని తెలిపారు. ఒక్కో జిల్లాలో ఒక్కోరోజు పాల్గొంటామన్నారు. ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించనున్నామని చెప్పారు. పదిరోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో రోజుకో అంశంపై చర్చ సాగుతుందని స్పష్టం చేశారు. జలసిరికి హారతి కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చామన్నారు. రూ.250 కోట్ల మేర విద్యుత్ పొదుపు చేశామన్నారు. ఇకపై కూడా విద్యుత్ చార్జీలు పెంచేది లేదని చెప్పిన సర్కారు తమది మాత్రమేనని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Prayer to protect from Corona Virus

Read More →