Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

CM KCR is acting like a street rowdy, says Mallu Battivikramarka

By   /  February 27, 2017  /  Comments Off on CM KCR is acting like a street rowdy, says Mallu Battivikramarka

    Print       Email

mallu-batti-vikramarkaముఖ్యమంత్రి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారు: మల్లు భట్టివిక్రమార్క

 

InCorpTaxAct
Suvidha

 

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విపక్షాల అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించడం లేదన్నారు. అంతేకాకుండా హోదాను దిగజారుస్తూ వీధి రౌడీలా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో ఏకంగా రెండు లక్షల కోట్ల మేర స్కామ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. వాటి అమలు కోసం అనేక కార్పొరేష్లు ప్రవేశపెట్టారని అన్నారు. అలాగే ఆర్ధిక సంస్థలు, బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కోసం రూ.28వేల కోట్లతో ప్రణాళికలు తయారు చేసిందన్నారు. ఆ ప్రాజెక్ట్ రీడిజైనింగ్ పేరుతో ఏకంగా రూ.90వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. రూ.875కోట్లతో పూర్తయ్యే రాజీవ్‌సాగర్‌ ప్రాజెక్టును రూ.10వేల కోట్లకు, రూ.2 వేల కోట్లతో పూర్తయ్యే కంతనపల్లి ప్రాజెక్టును రూ.9 వేల కోట్లకు అంచనాలు పెంచారని మండిపడ్డారు.దీని గురించి గట్టిగా ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలను ప్రగతి నిరోధకులుగా అభివర్ణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →