కాంగ్రెస్ పై ప్రశ్నల వర్షం కురిపించిన సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నేతలపై ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ 2009లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగాన్ని టీఆర్ఎస్ మేనిఫెస్టో అనడం అపహాస్యం చేయమేనని అన్నారు. గవర్నర్ ప్రసంగం తమ మేనిఫెస్టోను ప్రతిబింబించకపోతేనే సరైనది కానట్లు చెప్పారు. కాంగ్రెస్ టైమ్ లో పారిశ్రామిక వేత్తలు విద్యుత్ కోసం ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం పరిశ్రమలకు తాము 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. అలాగే సాగుకు కూడా విద్యుత్ అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ తండాలను గ్రామ పంచాయితీలుగా మారుస్తామని చెప్పి.. వాటిని గాలికొదిలేశారని మండిపడ్డారు.
సిద్దిపేటలో అమలు చేసిన తాగునీటి పథకాన్నే మిషన్ భగీరథగా అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. తమ పథకాన్ని యూపీ సర్కారు కూడా స్పూర్తిగా తీసుకుందన్నారు. తమ ప్రభుత్వం ఖచ్చితంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని పూర్తి చేస్తుందని స్పష్ట ంచేశారు. 2016 డిసెంబరు నాటికి 6,182 గ్రామాలు, 12 పురపాలక సంఘాలకు నీరందించి చూపిస్తామన్నారు. తెలంగాణలో శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం కోసమే తాము కృషి చేస్తున్నామన్నారు. అయితే విపక్షాలు మాత్రం ఎలాగైనా మిషన్ భగీరథను అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం.. ముఖ్యాంశాలు ..
*కాంగ్రెస్ పాలనలో రూ.200 పింఛను ఇస్తే తాము వెయ్యి ఇస్తున్నాం.
* కాంగ్రెస్ హయాంలో 29లక్షల మందికి పింఛన్లు ఇస్తే.. తమ హయాంలో ప్రభుత్వం 35.7లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నాం.
*బీడీ కార్మికులకు రూ.1000 జీవన భృతి కల్పిస్తున్నాం.
* సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెడుతున్నాం.
* పింఛన్లు, రేషన్ కార్డులు బాగా పెంచాం..
*ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ నెంబవర్ వన్
* గూగుల్, కాగ్నిజెంట్, అమెజాన్ వంటి దిగ్గజ పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి..
* ఐటీ అభివృద్ధికి టీహబ్ విశేష కృషి..
* జాతీయ, అంతర్జాతీయ ఫార్మా పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయని చెప్పారు.
* తొలి విడతలో 50శాతం రైతు రుణాలు మాఫీ.. ఈ బడ్జెట్ కేటాయింపులతో మలివిడత 75శాతం పూర్తవుతాయి.
* తాము తీసుకున్న నిర్ణయం వల్ల విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా రైతులకు పంపిణీ చేశాం.
* త్వరలో 21 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేసుకునేలా త్వరలో అందుబాటులోకి గోదాంలు తీసుకొస్తాం.
* రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం మంచి నిర్ణయం. పేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం..
* కొంత ఖర్చు ఎక్కువైనా.. ప్రైవేటుతో ముడిపెట్టి ఇళ్ల నిర్మాణం చేపట్టాం..
* లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లకే అప్పగించాం. లబ్ధిదారుల ఎంపికలో ఒక్క పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం..
* హైదరాబాద్లో ఆర్టీసీ నష్టం రూ.218 కోట్లు. ఆర్టీసీని పటిష్ట పరిచి లాభాల బాటలో నిలుపుతాం. ఆర్టీసీ బలోపేతానికి రూ.700 కోట్లు ఇచ్చాం..
* ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీఎస్ఐపాస్ విధానం తీసుకొచ్చాం. దీనివల్ల సుమారు రూ.33వేల కోట్ల మేర పెట్టుబడులు ఆకర్షించాం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.