Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

CM KCR review meeting on ‘Drugs Case’

By   /  July 17, 2017  /  Comments Off on CM KCR review meeting on ‘Drugs Case’

    Print       Email

ఎంతటి వారైనా సరే వదిలిపెట్టొద్దు.. డ్రగ్స్ కేసులో సీఎం కేసీఆర్ సమీక్ష..

 

EIS
EnGeniusInc

 

 

టాలీవుడ్ ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇదికాస్తా తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఇదిలాఉంటే ఈ కేసును పర్యవేక్షిస్తున్న ఎక్సైజ్ అధికారి అకున్ సబర్వాల్ కొద్ది రోజులు సెలవుపై వెళ్లనున్నారు. దీంతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు సాగుతున్నాయని పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించుకున్నారు. ఆయన డ్రగ్స్ కేసు అంశంపై సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ లో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, పద్మారావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ సహా ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులు ఎస్ నర్సింగరావు, సోమేష్‌కుమార్, శాంతికుమారి, ఎక్సైజ్‌ కమిషనర్ చంద్రవదన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావు, హైదరాబాద్‌, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మహేందర్ రెడ్డి, సందీప్‌ శాండిల్యా, మహేష్‌ భగవత్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీ ఎస్‌కే సింగ్‌, ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ అకున్ సబర్వాల్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఎవరిని వదలవద్దని సూచించారు. ఇందులో ఎవరి ప్రయేయం ఉన్నా కూడా వదలొద్దని చర్యలు తీసుకోవాలని సూచించారు. చివరకు మంత్రులైన సరే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రక్తాన్ని కల్తీ చేసి అమ్ముకున్నారన్న విషయం తెలిసి తనకు చాలా బాధ కలిగిందని అన్నారు. పేకాట, గుడుంబా నియంత్రణలో విజయం సాధించినట్లుగానే డ్రగ్స్ నియంత్రణలో కూడా విజయం సాధించాలని అధికారులకు తేల్చి చెప్పారు. డ్రగ్స్ ను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలను కేసీఆర్ ప్రశంసించారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Chief Minister opens new sand quarries to increase personal income: Anbumani.

Read More →