అసెంబ్లీలో నిద్ర పోయిన నేతలపై యోగి సీరియస్
యూపీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీలో జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపే అంశంపై చర్చ చేపట్టారు. ఈ సమయంలో కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు నిద్రకు ఉపక్రమించారు. దీంతో వారిపై సీఎం యోగి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
యూపీ అసెంబ్లీలో నిద్రపోయిన మంత్రిని యోగి తన దగ్గరకు పిలిపించుకుని మరీ నిలదీశారు. ఆ మంత్రి ఘటనపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందట. తాను రాత్రంతా తన నియోజకవర్గంలో పర్యటించడం వల్ల అనుకోకుండా నిద్రపోయానని చెప్పారట. అయితే మరోసారి సమావేశాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పారట.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.