Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Commission not for Rohith Vemula caste said Prakash Javadekar..

By   /  August 27, 2016  /  Comments Off on Commission not for Rohith Vemula caste said Prakash Javadekar..

    Print       Email

Mumbai: Minister of Information and Broadcasting Prakash Javadekar during a press conference in Mumbai on Friday. PTI Photo(PTI6_13_2014_000174B)

రోహిత్ కులం నిర్ధారణ కోసం కమిషన్ వేయలేదు: ప్రకాశ్ జవడేకర్

InCorpTaxAct
Suvidha

 

 

 

హెచ్ సీయూ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఏర్పాటైన జస్టిస్‌ రూపన్‌వాలా కమిషన్‌ నివేదికపై వివాదం చెలరేగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రోహిత్ వేముల కులంపై కమిషన్‌ నివేదికలోని ప్రస్తావనలను పరిగణనలోకి తీసుకోబోమని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ తేల్చి చెప్పారు. కమిషన్‌ తన నివేదికలో రోహిత్ వేమూల బీసీ వర్గానికి చెందిన విద్యార్థి అని పేర్కొన్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీనిపై జవడేకర్‌ మాట్లాడారు. రోహిత్ వంటి అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకోవడంలో ఎదురమ్యే సమస్యలను తెలుసుకోవడానికి కమిషన్ వేశామన్నారు. ఆ సమస్యల నివారణ కోసం మార్గాలను సూచించడం కోసమే కమిషన్ వేశామన్నారు. అంతేతప్ప రోహిత్ వేముల కులాన్ని నిర్ధారించడం కోసం కాదన్నారు.

కమిషన్ తన నివేదికలో కులాన్ని ప్రస్తావించినప్పటికీ.. రోహిత్ కులంతోపాటు, ఆయన మరణానికి యూనివర్సిటీ అధికారులు ఎంతవరకు కారణం అనే అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. హెచ్‌సీయూ సహా దేశంలోని అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీల పరిధిలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల తొలగింపునకు సంబంధించి మాత్రమే కమిషన్‌ ఇచ్చిన సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటామన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →