Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Committed to reservation for Kapu community: AP CM Chandra Babu

By   /  February 25, 2016  /  Comments Off on Committed to reservation for Kapu community: AP CM Chandra Babu

    Print       Email

chandra babu naidub

బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు

InCorpTaxAct
Suvidha

 

బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఏలూరులో జరిగిన కాపు రుణమేళాకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. టీడీపీ బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ అన్నారు. బడుగు వర్గాలకు గుర్తింపు తెచ్చిన నేత ఎన్టీఆర్ అని అన్నారు. తాము చేతి వృత్తులు, కుల వృత్తులను గౌరవిస్తామన్నారు. అలాగే కాపులను కూడా గౌరవిస్తామన్నారు. పేద కాపులను ఆర్ధికంగా మంచి స్థితికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది కాపులకు వెయ్యి కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 192 కోట్ల మేర రుణాలు ఇస్తున్నామని చెప్పారు.

 

తాము కాపు రిజర్వేషన్ కమిటీని ఏర్పాటు చేశామని చంద్రబాబు వెల్లడించారు. ఆ కమిటీకి 9 నెలలు కాలపరిమితి కూడా విధించామన్నారు. అలాగే టీడీపీని ఆదరించిన పశ్చిమ గోదావరి జిల్లాను కూడా అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అయితే కొందరు.. తాము చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఆందోళన ముసుగులో విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్ధిక మోసాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమన్నారు. పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధికి కొందరు అడ్డుపడుతున్నారని.. భూములు ఇచ్చే రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →