Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Common Wealth Games, India is winning

By   /  April 14, 2018  /  Comments Off on Common Wealth Games, India is winning

    Print       Email

కామ‌న్వెల్త్‌లో దూసుకుపోతున్న భార‌త్‌

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* కొన‌సాగుతున్న ప‌త‌కాల ప‌రంప‌ర‌

* రెజ్ల‌ర్ల‌, షూట‌ర్లలో ప‌త‌కాల మోత

* కొత్త చ‌రిత్ర సృష్టించిన అనీష్ భ‌న్వాలా

డెక్క‌న్ అబ్రాడ్‌: కామన్‌వెల్త్ గేమ్స్‌లో  భారత రెజ్లర్ల పతకాల పట్టు కొనసాగుతోంది.  భారత రెజ్లర్ బజరంగ్ పునియా భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేర్చాడు. మరోవైపు భారత షూటర్ అనీష్ భన్వాలా చరిత్ర సృష్టించాడు. భారత్ తరపున  కామన్‌వెల్త్ గేమ్స్ చరిత్రలో బంగారు పతకం సాధించిన అతి పిన్నవ యస్కుడిగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించు కున్నాడు. 25 మీటర్ల రాపిడ్ పిస్టల్ విభాగంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అనీష్ తన కంటే ఎన్నో ఏళ్ల అనుభవం గల ప్రపంచస్థాయి సీనియర్లను వెనక్కునెట్టి విజేతగా నిలిచాడు. ఓ దశలో ఆస్ట్రేలియాకు చెందిన షూటర్ సెర్గి ఎవ్‌గ్లెవ్‌స్కీ(2014 కామన్‌వెల్త్ గోల్డ్ మెడలిస్ట్)ను సైతం అనీష్ అధిగమించిన ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పోటీపడి  ఆఖరి రెండు రౌండ్లలో   రెండు ఎక్కువ పాయింట్లు సాధించి పసిడి పట్టాడు.  అన్ని రౌండ్లలో కలిపి అనీష్ 30 పాయింట్లు సాధించగా.. సెర్గి 28 పాయింట్లతో రెండో స్థానంలో, ఇంగ్లండ్‌కు చెందిన శామ్ 17 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.   25 మీటర్ల రాపిడ్ పిస్టల్ ఈవెంట్లో 30 పాయింట్లు సాధించడం కామన్‌వెల్త్ క్రీడల్లో ఇదే తొలిసారి.

 

షూటింగ్‌లో జూనియర్ వరల్డ్ రికార్డు అనీష్ పేరిటే ఉంది. గత షూటింగ్ వరల్డ్ కప్‌లో సైతం అనీష్ స్వర్ణం సాధించాడు. భారత్ తరఫున 15 ఏళ్ల వయసులో అభినవ్ బింద్రా కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. అయితే పతకం సాధించలేక పోయాడు. ఈ స్వర్ణంతో భారత్ ఖాతాలో 17 పసిడి పతకాలు చేరాయి. దీంతో గ్లాస్గో కామన్‌వెల్త్‌లో భారత్ గెలుచుకున్న 15 స్వర్ణ పతకాల రికార్డును భారత్ దాటింది. 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో భారత మహిళా షూటర్లు తేజస్విని సావంత్ స్వర్ణానికి గురి పెట్టగా, అంజుమ్ రెండు పాయింట్ల తేడాతో రజతం పతకం సాధించింది. తేజస్విని 457.9 పాయిట్లతో కామన్‌వెల్త్ గేమ్స్‌లో రికార్డు సాధించి పసిడిని గెలిచారు. కాగా, రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో తేజస్విని ఇంతకు ముందు ఇదే పోటీల్లో రజతం గెలుచుకుంది.  ఈ స్వర్ణంతో తేజస్వినీ సావంత్ మొత్తం కామన్వెల్త్ పత కాల సంఖ్య ఏడుకు చేరుకుంది.

కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటివరకూ భారత్ 42 పతకాలు సాధించగా.. అందులో 17 స్వర్ణాలు, 11 రజతాలు,

14 కాంస్య పతకాలు ఉన్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Tribute to Ghantasala

Read More →