Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Common Wealth Games – More Medals to India

By   /  April 8, 2018  /  Comments Off on Common Wealth Games – More Medals to India

    Print       Email

భార‌త్‌కు ప‌త‌కాల పంట‌

InCorpTaxAct
Suvidha

 

 

 

* షూటింగ్‌లో మ‌నుభాక‌ర్, వెయిట్ లిఫ్టింగ్‌లో పూన‌మ్ యాద‌వ్‌కు స్వ‌ర్ణం

* హీను సిధుకు ర‌జ‌తం

* క్రీడాకారుల‌కు అభినంద‌న‌ల వెల్లువ‌

డెక్క‌న్ అబ్రాడ్‌: గోల్డ్‌కోస్ట్‌ కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. తాజాగా షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లలో స్వర్ణ పతకాలు భారత్‌ను వరించాయి. ముఖ్యంగా భారత యువ షూటింగ్ సంచలనం మను భాకర్.. తొలి ప్రయత్నంలోనే (కామన్‌వెల్త్) స్వర్ణం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక, ఆమెతో పాటు షూటింగ్‌లో పంజాబ్‌లోని లూథియానాకు చెందిన హీనా సిధుకు రజత పతకం వచ్చింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హర్యానాకు చెందిన 16 ఏళ్ల మను భాకర్ గోల్డ్ కొట్టేసింది. తన కన్నా అనుభవజ్ఞులు పోటీలో పాల్గొన్నా వారందరినీ వెనక్కు నెట్టేసి అత్యధికంగా 240.9 పాయింట్లు సాధించి కామన్‌వెల్త్ గేమ్స్‌లో కొత్త రికార్డు సృష్టించింది. ఇక, హీనా సిధు మొత్తం 234 పాయింట్లు సాధించి రజత పతకం గెలుచుకుంది. ఫైనల్‌లో వరుసగా 10, 10.3, 10.6 ఆ తర్వాత 10.9 పాయింట్లతో హీనాను, ఆస్ట్రేలియా షూటర్ ఎలీన్ గలియబోవిచ్‌ను దాటేసి ముందుకెళ్లిపోయింది. ఇక, చివరి షాట్‌లో భాకర్ 10.4 పాయింట్లు సాధించేసి 16 ఏళ్ల ప్రాయంలోనే గోల్డ్ కొట్టేసింది. ఇటు హీనా కూడా మెరుగ్గా రాణించింది. ఒకానొక దశలో ఎలిమినేషన్ దశలో ఉన్న ఆమె 10.3. 10.2 పాయింట్లు సాధించి ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక, చివరిగా 10.1, 10.1, 9.1, 9.7 పాయింట్లతో రజత పతకం సాధించింది. ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఎలీన్ గలియబొవిచ్ 214.9 పాయింట్లతో కాంస్యంతో సరిపెట్టుకుంది.

కాగా వెయిట్ లిఫ్టింగ్‌లోనూ భారత ఆటగాళ్లు సత్తా చూపిస్తున్నారు. 69 కిలోల మహిళల విభాగంలో పూనమ్ యాదవ్ స్వర్ణం సాధించింది. మొత్తంగా వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు ఐదో స్వర్ణ పతకం అందించింది పూనమ్ యాదవ్. వారణాసికి సమీపంలోని ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం చాంద్‌మరి గ్రామానికి చెందిన ఆమె మొత్తం 222 కిలోల బరువును లేపిన ఆమె స్వర్ణం సాధించింది. ఆ పోరు కాస్త ఉత్కంఠను రేకెత్తించింది. తొలుత స్నాచ్ ఈవెంట్‌లో 95, 98, 100 కిలోలను ఎత్తిన ఆమె.. క్లీన్ అండ్ జర్క్‌లో 118, 122 కిలోలు ఎత్తి చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్‌కు చెందిన సారా డేవిస్‌కు (217) సిల్వర్ సాధించగా, ఫిజికి చెందిన అపోలోనియా వాయ్‌వాయ్ (216) రజత పతకాలను సాధించారు. కాగా, ఈ పతకాలతో భారత్ పతకాల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →