Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Confused Congress Fails In RS Despite Strength… Loss Continues for AP

By   /  July 23, 2016  /  Comments Off on Confused Congress Fails In RS Despite Strength… Loss Continues for AP

    Print       Email

Flag_of_the_Indian_National_Congress.svgకాంగ్రెస్ విఫ‌ల‌మైందా?

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను విభ‌జించే క్ర‌మంలో ఏపీకి ఐదేళ్లు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ పార్ల‌మెంట్ సాక్షిగా ప్ర‌క‌టించ‌గా.. ఐదేళ్లు కాదు.. ప‌దేళ్లు ఇవ్వాల‌ని అప్ప‌టి బీజేపీ నాయ‌కులు డిమాండ్  చేశారు. అయితే అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేదు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు కేవీపీ రామచంద్ర‌రావు రాజ్య‌స‌భలో ప్ర‌త్యేక హోదాపై ప్రైవేటు బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన  నేప‌థ్యంలో దాన్ని నెగ్గించుకోవాల్సిన కాంగ్రెస్ ఎందుకుకో పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌లేద‌నిపిస్తోంది. అస‌లు ప్ర‌త్యేక హోదాపై బిల్లు పెడితే దాన్ని ప్ర‌ధాన్య‌త క్ర‌మంలో మొద‌ట తీసుకోవాలి. ఎందుకంటే ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌న్న‌ది కాంగ్రెస్ కాబ‌ట్టి దాన్ని గ‌ట్టిగా పోరాడి సాధించాల్సిన బాధ్య‌త కూడా కాంగ్రెస్ కుంటుంది. అలా పోరిడితే ఆ పార్టీకి మైలేజీ కూడా వ‌స్తుంది. కాగా ఎందుక‌నో ఏమో కానీ ప్ర‌త్యేక హోదాపై చ‌ర్చించేందుకు పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌ప‌రిచిన‌ట్లు క‌నిపించ‌లేదు.

InCorpTaxAct
Suvidha

అయితే రాజ్య‌స‌భ‌లో మెజార్టీ స‌భ్యులు కాంగ్రెస్ వారే. దాదాపు 60 మందికి పైగా ఉన్నారు. ఇలాంటి క్ర‌మంలో ఏపీ ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక హోదాను సాధించుకోవ‌చ్చు. ఆ బిల్లును నెగ్గించుకోవ‌చ్చు. మ‌రి అలాంట‌ప్పుడు బీజేపీ స‌భ్యులు ప్ర‌త్యేక హోదా బిల్లును చ‌ర్చ‌కే రాకుండా అడ్డ‌కుంటున్న‌ప్పుడు దాన్ని కాంగ్రెస్ వాళ్లు తిప్పి కొట్ట‌వ‌చ్చు. కానీ నిన్న రాజ్య‌స‌భ‌లో మాత్రం బీజేపీ వాళ్ల‌దే పైచేయి అయింది. కాగా కాంగ్రెస్‌పార్టీ స్టాండ్ ఏంటో ఆ పార్టీ నేత‌ల‌కు కూడా అర్థం కావ‌డం లేదు. మొత్తంగా చూసుకుంటే ప్ర‌త్యేక హోదాపై ప్ర‌వేశ‌పెట్టిన బిల్లును చ‌ర్చ‌కు తీసుకువ‌చ్చి పాస్ చేయించుకోవ‌డంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →