Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Congress and TDP are trying for president’s rule in Telangana, We will not keep quiet -KCR

By   /  June 16, 2016  /  Comments Off on Congress and TDP are trying for president’s rule in Telangana, We will not keep quiet -KCR

    Print       Email

2014-12-10_192127_KCR_HYdస‌ర్కార్‌ను ప‌డ‌గొట్టాల‌ని చూస్తే ఊరుకోవాలా?

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణలో తమ ప్రభుత్వాన్ని కూలదోసి.. రాష్ట్రపతి పాలన పెట్టించాలని కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు కుట్రపన్నాయని అలా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు తీవ్ర స్థాయిలో ఫైర‌య్యారు. ఆ పార్టీ వాళ్లు ఏది చేసినా సంసారం.. మేం ఏం చేసినా అది వ్య‌భిచారామా అంటూ ప్ర‌తిప‌క్షాల‌ను నిల‌దీశారు. కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి, మాజీ ఎంపీ వివేక్‌, మాజీ మంత్రి వినోద్‌, ఎమ్మెల్యేలు భాస్య‌ర‌రావు, ర‌వీంద్ర‌నాయ‌క్‌లు కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లో చేరిన సంద‌ర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని, ఇంటెలిజెన్స్ స‌మాచారం ఇవ్వ‌డంతో పాటు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా చెప్పార‌ని గుర్తు చేశారు. టీఆర్ఎస్‌కు తమ వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పడమే కాక, వాళ్ల పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో సమావేశం కూడా ఏర్పాటుచేసి చెప్పారని అన్నారు.

బెర్లిన్ గోడ పగలగొట్టి జర్మనీ ఏకమైనట్లుగా తెలుగు రాష్ట్రాలు మళ్లీ ఏకమవుతాయని చంద్రబాబు అన్నారని.. దానికి ఈ కుట్రే నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రభుత్వం మధ్యలో పారిపోతుందన్నార‌న్నారు. ఇలా చేస్తూ ఉంటే ఎవ‌రైనా ఎలా చూస్తూ ఊరుకుంటార‌న్నారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్య‌మానికి ముందు కూడా రాష్ట్రం కోసం ఎవ‌రూముందు రాజీనామాలు చేసిన దాఖ‌లాలు లేవ‌ని, ఇప్పుడు మేం తెచ్చాం అని చెప్పుకోవ‌డం సిగ్గు చేట్ట‌న్నారు. ఇప్ప‌టికైనా అంద‌రూ త‌మ క‌లిసి వ‌చ్చి రాష్ట్ర అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →