Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Congress back step on No-confidence motion

By   /  March 17, 2016  /  Comments Off on Congress back step on No-confidence motion

    Print       Email

jana reddy

అవిశ్వాసంపై కాంగ్రెస్ బ్యాక్ స్టెప్.. ఎందుకు..?

InCorpTaxAct
Suvidha

 

తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలని స్కెచ్ వేసింది. అంతేకాదు.. ఈ అస్త్రంతో అధికార పార్టీని ఇరుకున పెట్టాలని భావించింది. అలా అధికార పార్టీకి షాక్ ఇద్దామని ప్లాన్ చేశారని సమాచారం. అయితే ఉన్నట్లుండి ఆ పార్టీ మాట దాటవేసింది.మేం అవిశ్వాసం పెట్టడమా…? అబ్బే అదేం లేదే.. అంటూ మాట మార్చింది. ఇంతకీ అవిశ్వాసంపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు బ్యాక్ స్టెప్ వేసింది.శాసనసభలో ప్రతిపక్షాల స్వరం వినిపించే అవకాశం రాలేదని ఆ పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో సభలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని భావించింది. దీంతో సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్‌ నేతలు ప్లాన్ చేసుకున్నారు.

కాంగ్రెస్ నేతలు అందరూ సైలెంట్..

మరి కాంగ్రెస్ నేతలకు ఏమైందో ఏమో గాని ఉన్నట్లుండి అందరూ సైలంట్ అయిపోయారు. అసెంబ్లీకి వ‌చ్చిన జానా రెడ్డిని అవిశ్వాసం అంశంపై మీడియా ప్రతినిధులుప్రశ్నించారు. అయితే అవిశ్వాసమా..? ఎవరు చెప్పారంటూ జానారెడ్డి సమాధానం ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ వెనక్కుతగ్గినట్లుగా అర్ధం చేసుకోవచ్చు అవిశ్వాసం పెడతామని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డే స్వయంగా చెప్పడం.. తర్వాత అదేం లేదని సీఎల్‌పీ నేత జానారెడ్డి అనడం ఆ పార్టీలో నేతల ద్వంద్వ వైఖరి బయటపడినట్లైంది.అయితే అవిశ్వాసంపై చర్చ జరిగినా.. దానిపై ఎమ్మెల్యేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడైనట్లు సమాచారం. అవిశ్వాసం పెడదామని కొందరు..వద్దని మరికొందరూ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కొందరు అభిప్రాయపడ్డట్లు సమాచారం.

అలాగే.. కాంగ్రెస్‌ ప్రతిపాదనకు పలు ప్రతిపక్ష పార్టీలు సానుకూలంగా స్పందించలేదు.దీనికి తోడు సర్కార్‌పై అవిశ్వాసం పెడితే టీఆర్‌ఎస్‌ కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలను గులాబీ తోటలోకి లాగేలా ఉందన్న భయం కూడా హస్తం నేతలను వెంటాడుతోందట. దీనివల్లే అవిశ్వాసంపై వెనక్కు తగ్గినట్లు రాజకీయ వర్గాల సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →