Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Congress-BJP trying for govt. formation..!

By   /  March 12, 2017  /  Comments Off on Congress-BJP trying for govt. formation..!

    Print       Email

bjp congress flagsమణిపూర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

మణిపూర్ లో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు మేజిక్ ఫిగర్ ను సాధించలేకపోయాయి. దీంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై గందరగోళం నెలకొంది. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. అంటే మేజిక్ ఫిగర్ 31గా ఉందన్నమాట. ఈ ఫిగర్ ను రెండు పార్టీలు రీచ్ కాలేకపోయాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై స్వతంత్రులు కీలకంగా మారారు.

ఇక మణిపూర్ లో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా సీఎం ఒక్రమ్ ఇబోబి సింగ్ మళ్లీ ఎన్నికయ్యారు. రేపు ఆయన గవర్నర్ తో భేటీ కానున్నారు. ఆయన గత 15 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానుంది. బీజేపీ 21 స్థానాలు సాధింింది. ఎన్ పీఎఫ్ 4, ఇతరులు 7 స్థానాలు సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. దీంతో రెండు పార్టీల్లో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది ఉత్కంఠను కలిగిస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →