Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Congress, DMK will fight 2016 Tamil Nadu assembly polls together

By   /  February 13, 2016  /  Comments Off on Congress, DMK will fight 2016 Tamil Nadu assembly polls together

    Print       Email

mk stalin - source ani

తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ పొత్తు ఖరారు..

InCorpTaxAct
Suvidha

 

తమిళనాట పొత్తు పొడిచింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి పోటీచేయనున్నట్లు కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ ప్రకటించారు.ఆయన డీఎంకే చీఫ్ కరుణానిధితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.వీరిద్దరి మధ్య చాలాసేపు చర్చలు నడిచాయి. అనంతరం ఆజాద్ మీడియాకు తమ పొత్తు గురించి వివరించారు. తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీచేస్తాయని చెప్పారు. డీఎంకే సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని ఆజాద్ తేల్చి చెప్పారు. సీట్ల సర్దుబాటుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఈ విషయంపై డీఎంకే నేతలతో మరిన్ని చర్చలు జరగాల్సి ఉందన్నారు. ఆ తర్వాతే సీట్ల పంప కంపై స్పష్టత వస్తుందన్నారు. డీఎంకే ఆధ్వర్యంలోనే ఎన్నికల్లో ముందుకు వెళ్లబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఇదే విషయంపై డీఎంకే నేత స్టాలిన్ కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.2016ఎన్నికల్లో కాంగ్రెస్ కలిసి ఎన్నికలను ఎదుర్కోబోతున్నట్లు చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →