Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Congress is trying to gain momentum in Telangana

By   /  June 3, 2016  /  Comments Off on Congress is trying to gain momentum in Telangana

    Print       Email

congress_logo_Roundకాంగ్రెస్ కొత్త ఆలోచ‌న ఫ‌లిస్తుందా?

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ స‌ర్కార్ దూసుకుపోతున్న త‌రుణంలో  ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ త‌మ అస్త్రాల‌కు ప‌దును పెడుతోంది. పార్టీ సీనియ‌ర్లు అంతా మీటింగ్‌లు పెట్టుకుంటూ కార్యాచ‌ర‌ణ రూపొందించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌వుతున్నారు.  టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి  రెండేళ్లు అవుతున్న ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌లేద‌నే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లో తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందులో భాగంగానే నిన్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం రోజునుంచే అధికార పార్టీపై  త‌మ అస్త్రాల‌ను ప్ర‌యోగిస్తున్నారు. తెలంగాణ తెచ్చింది ఇచ్చింది తామే అంటూ ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. గడిచిన రెండేళ్ళ  కాలంలో సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా…ప్రజలను మభ్య పెడుతున్నారని విమ‌ర్శించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య – దళితులకు 3 ఎకరాల భూమి – దళిత సీఎం – డబుల్ బెడ్ రూం ఇళ్లు….ఇలా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏమ‌య్యాయ‌ని టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఎన్నిక‌ల ముందు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి? మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు ఏంటి? అవి ఎంత‌వ‌ర‌కు నెర‌వేరాయి అనే వాటిని ప్ర‌స్తావిస్తూ ఊరువాడా కరపత్రాలు పంచాలని కాంగ్రెస్ నేతలు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. రైతుల ఆత్మహత్యలు – కరువు సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ఈరెండేళ్ల‌లో రాష్ట్రంలో జరిగిన ఎన్ కౌంటర్లు – ప్రజాసంఘాల నేతలపై పెట్టిన అక్రమ కేసులు – మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇప్పుడు లక్ష కోట్ల అప్పుల్లో ఎందుకుందనే అంశాల‌ను క‌ర‌ప‌త్రాలు ముద్రించి పంచ‌నున్నారు. మ‌రి క‌ర‌ప‌త్రాల‌తోనే ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకత వ‌చ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుందా అన్న‌ది అనుమాన‌మే.  కానీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంలో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ ప్ర‌జ‌ల త‌రుపున పోరాటం చేస్తోంద‌న్న‌ది వాస్త‌వం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →