Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Congress Leader KomatiReddy Counter to TRS Party Leaders

By   /  March 13, 2018  /  Comments Off on Congress Leader KomatiReddy Counter to TRS Party Leaders

    Print       Email

టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ అదిరిపోయే కౌంట‌ర్‌

 

Suvidha
Biryani Pot

 

 

 

 

* టీఆర్ఎస్ త‌ప్పుల‌ను ఎత్తిచూపిన కాంగ్రెస్‌

* గ‌తంలో హ‌రీష్ రావు ఏం చేశారో మ‌రిచారా?

* నాడు త‌ప్పులు..నేడు సుద్ధులా?

* మీకో న్యాయం..మాకో న్యాయ‌మా?

* టీఆర్ఎస్‌కు కౌంట‌ర్‌గా వీడియో విడుద‌ల చేసిన కాంగ్రెస్‌

డెక్క‌న్ అబ్రాడ్‌:  తెలంగాణ స‌ర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ ఎదురు దాడికి దిగింది. శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ స్వామిగౌడ్‌పై కాంగ్రెస్ పార్టీ నేత‌లు దాడి చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించిన టీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌కు కాంగ్రెస్ అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చింది. అంతేకాదు మీకో న్యాయం?  మారో న్యాయ‌మా? అని ప్ర‌శ్నించింది. దీంతో టీఆర్ఎస్ డైల‌మాలో ప‌డింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. తెలంగాణ అసెంబ్లీలో కోమటిరెడ్డి ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోను ప్రభుత్వం విడుదల చేయడం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ గతంలో అసెంబ్లీలో టీఆర్ఎస్ సభ్యుల వ్యవహార తీరుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. గవర్నర్ నరసింహన్ బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ సభ్యులు…ఆయనపై దాడి చేసినంత పనిచేశారంటూ మండిపడ్డారు. మరీ ముఖ్యంగా హరీశ్ రావు నాడు సభలో ఎలా ప్రవర్తించారో? చూడాలని విమర్శిస్తున్నారు.  గతంలో అసెంబ్లీలో అలా ప్రవర్తించిన టీఆర్ఎస్ నేతలు…ఇప్పుడు తమకు సుద్ధులు చెబుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

 

సభలో ప్రజాసమస్యలపై నిరసన తెలిపే హక్కు తమకు ఉందని అంటున్నారు. ఈ విషయంలో మీకో న్యాయం? మాకో న్యాయమా? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ధీటైన స‌మాధానం ఇచ్చేందుకు టీఆర్ఎస్ నాయ‌కులు క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌ల‌హాలు తీసుకుంటున్నారు. ఎన్నిక‌ల స‌మీపిస్తున్న కొద్ది మ‌నం వెనుక‌డుగు వేస్తే ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు సంకేతాల వెళ్తాయ‌ని, ఏది ఏమైనా ప్ర‌తిప‌క్షంపై దూకుడు పెంచి వాళ్ల నోర్లు మూయించాల్సిందేన‌న్న ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన్లట్లు తెలుస్తోంది. చూడాలి మ‌రి ఎవ‌రు ఎవ‌రిపై పైచేయి సాధిస్తారో.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TANA will not let criminals run our well earned reputation, Satish Vemana

Read More →