ఆయనే ఉండి ఉంటే ఇలా జరిగేదా?
రాష్ట్ర, దేశ కాంగ్రెస్‌పార్టీ నేతలు ఇప్పుడు చనిపోయిన ఆ నేతను తలుచుకుంటున్నారు. ఆయన లేని లోటును ఎవరూ పూర్తి చేయలేనిదని అంటున్నారు. ఆయనే ఉండి ఉంటే ఇలా జరిగేదా అంటూ బాధపడుతున్నారు. ఇంతకూ ఎవరు ఆయన అనుకుంటున్నారా? ఆయనే దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి. ఒక్క నాయకుడి మరణం తర్వాత రాష్ట్రం ఎలా అయిపోయిందో తెలుగు ప్రజలకు చెప్పనక్కర్లేదు. వైయస్ మరణం తరువాత ప్రజలు ఎంత నష్టపోయారో.. అంతకంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. ఆ పార్టీ నేతలు నేటికీ ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్‌పార్టీ హై కమాండ్ పెద్దల్లో ఒకరైన జయరాం రమేష్ కూడా వైయస్‌ను మరోసారి గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ రచించిన ‘గడచిన చరిత్ర – తెరచిన అధ్యాయం` అనే పుస్తక ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. వైఎస్ రాజశేఖరెడ్డి మరణించకపోయి ఉంటే, ప్రస్తుత పరిణామాలు భిన్నంగా ఉండేవని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహానేత మరణాంతరం రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 90 మంది వరకూ రెడ్డి వర్గీయులు విజయం సాధిస్తుండేవారని, వైఎస్ మరణం తరువాత జరిగిన పరిణామాలతో ఆ వర్గం తమకు దూరమైందన్న భావనకు కాంగ్రెస్ వచ్చిందన్న అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. ఇతర కులాలను కాంగ్రెస్ ఆకట్టుకోలేక పోయిందని, తమతో ఉన్నవారిని దూరం చేసుకుని కాంగ్రెస్ ఘోరంగా నష్టపోయిందని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా చనిపోయి కూడా రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వ్యక్తుల్లో వైయస్ రాజశేఖరరెడ్డి ప్రముఖంగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.