ఏపి కాంగ్రెస్లో అంతర్మథనం
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వింత పరిస్థితి ఎదుర్కొంటోంది. పార్టీలో సీనియర్ నేతలు, సమయానుసారం ప్రజా సమస్యలపై స్పందిస్తున్నా విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజానికంలో తిరిగి పట్టుసాధించలేకపోతోంది. ఈ విషయాన్ని ఏపి కాంగ్రెస్లో కొనసాగుతున్న సీనియర్ నేతలు సైతం ధృవీకరిస్తున్నారు. ఎన్నో ప్రజా సమస్యలపై పోరాటాలు చేసినా పార్టీకి మైలేజీ రావడం లేదని ఆ పార్టీ నేతలు మథనమడిపోతున్నారు. కనీ సంగా తమ పోరాటాలపై జనంలో చర్చ సాగడంలేదని ఏపి కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు పేర్కొంటున్నారు. జనంలో తమ పార్టీ పోరాటాలపై చర్చ జరగకపో వడానికి తమ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలు కరువవ్వడం కూడా ఓ కారణమని ఆయన పేర్కొంటున్నారు. తమ పార్టీ అధినాయకత్వం తీసుకొన్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కూడా ఏపి ప్రజానికం అంత తేలికగ్గా మరిచిపోలేక పోతోందని ఆయన పేర్కొంటున్నారు. ఏపికి ప్రత్యేక హోదాకోసం రాజ్యసభలో ఏపి కాంగ్రెస్ పార్టీ ఎంపీలుపోరాటం చేస్తున్నారు.
ఈ ఒక్క అస్త్రమే పార్టీని బతికించుకోనేందుకు ఉపయోగపడదన్న భావనను కూడా కాంగ్రెస్ నేతలు వ్యక్తంచేస్తున్నారు. పార్టీకి కార్యకర్తల బలం సమీకరించేందుకు వీలుగా పట్టణాలలో వార్డుల వారీగా పార్టీ నాయకత్వం బలోపేతం కోసం ప్రత్యేక దృష్టిసారించాలని ఏపి కాంగ్రెస్ నాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామస్థాయిలోనూ ఇదే పంథాను అనుసరించాలని ఏపి కాంగ్రెస్ భావిస్తోంది. తద్వారా తాము కోల్పోయిన పట్టును తిరిగి సాధించుకోవాలని ఏపి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమాలోచనలు చేస్తోంది. అప్పుడే తాము చేసే ప్రజా పోరాటాలలో సహజంగానే క్షేత్రస్థాయి నాయకత్వం భాగస్వామ్యం పెరుగు తుందని తద్వారా స్థానిక ప్రజానికం భాగస్వామ్యం కూడా ఈ ఉద్యమాలలో పెరుగుతుందని ఏపి కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు పేర్కొంటున్నారు.
ప్రతిప క్షాలుగా ఎన్ని ప్రజా ఉద్యమాలు చేసినా అందులో ప్రజానికం భాగస్వా మ్యంలేకపోతే ఆ ఉద్యమాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని ఆయన పేర్కొంటున్నారు. ఈ సమస్య తమది అని తమ పక్షాన పోరాడుతున్నది ఈ ప్రతిపక్షాలు అన్న భావన ప్రజానికంలో కలిగినప్పుడే ఏ పార్టీ అయిన అభివృద్ది చెందుతుందని, మనుగడ సాధించగలదని కాంగ్రెస్ ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కార్యకర్తల సమీకరణ, స్థానికంగా నాయ కత్వం బలోపేతం వంటి అంశాలపై ప్రధానంగా ఏపి కాంగ్రెస్ నాయకత్వం దృష్టిసా రిస్తున్నట్లు సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.