కాంగ్రెస్‌కు దొరకని `నాయకుడు`
తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే తమకు తెలంగాణలో తిరుగుండదనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణను తమ ఖాతాలో వేసుకోవాలని భావించిన కాంగ్రెస్ పార్టీ నేతల పాచికలు ఇక్కడ పారలేదు. దీంతో ప్రధాన ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సివచ్చింది. ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలకు అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సారథ్యం వహించారు. ఆయన నాయకత్వ లోపంతోనే పార్టీ ఘోరపరాజయం పాల య్యిందని అదే పార్టీకి చెందని పలువురు ముఖ్య నేతలు బహిరంగ విమర్శలకు దిగడంతో, పొన్నాలను తప్పించి అతని స్థానంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పార్టీ పగ్గాలను కట్టబెట్టారు. ఎలాంటి అంతర్గత విబేధాలు లేకుండా కొంతకాలం పార్టీని ఏకతాటిపైకి తేవడంలో ఉత్తమ్ కుమా ర్‌రెడ్డి సఫీలీకృతులు కాగలిగారు. టీఆర్ఎస్ పార్టీ ఏడాదిన్నర పాలనలోపే ఉప ఎన్నికల వేడి మొదలు కావడం, రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికలల్లో కాంగ్రెస్ వరుస వైఫల్యాలను పొందడంతో పార్టీలోని అసమ్మతి వర్గం ఉత్తమ్‌కుమార్‌పై విమర్శలు ఎక్కుబెట్టారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు తెలంగాణలో బాగానే ఉన్నా… వారిని మెప్పించడంలో నాయకత్వం వైఫల్యం చెందుతుందనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికి వెన్నంటి ఉండే దళి తులు, మైనార్టీల వర్గాలల్లో టీఆర్ఎస్ పార్టీ చీలక తెచ్చి తమకు అనుకూలంగా మార్చుకుంటూనే ఉంది.
అధికార పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేకపోతున్నా… ప్రజల్లో అసంతృప్తి లేకుండా అధికార పార్టీ తగు జాగ్రత్తలను చేపడుతోంది. ఇచ్చిన హామీ లను నిలదీయడంలో కాంగ్రెస్ శ్రేణులు విఫలం చెందారనే చెప్పాలి. ఎందు కంటే టీఆర్ఎస్ ఇచ్చిన ఉచిత నిర్బంధ విద్య, దళితులకు మూడెకరాల భూపంపిణి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, బీసీల సంక్షేమాన్ని విస్మరించినా ప్రభుత్వాన్ని నిలదీయలేక పోయారనే అపవాదు కాంగ్రెస్ నేతలకు చుట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 22 మంది ఎమ్మెల్యేలలో దాదాపు అరడజను మందికి పైగా ఎమ్మెల్యేలు, అదే సంఖ్యలో ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరిపోయారు. ఎప్పుడు ఏ నాయకుడు పార్టీ మారతారోనన్న అభద్రతా భావంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నిత్యం సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో పార్టీని నడిపించగల ఒక సరైన వ్యక్తి కాంగ్రెస్‌కు దొరకడం లేదంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.