Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Congress re-birth

By   /  April 26, 2016  /  Comments Off on Congress re-birth

    Print       Email

congress-logoకాంగ్రెస్‌లో చిగురిస్తున్న ఆశ‌లు

 

InCorpTaxAct
Suvidha

 

 

ఉమ్మ‌డి రాష్ట్రాన్ని విడ‌గొట్టార‌నే కార‌ణంగా కాంగ్రెస్‌ను రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు ఆ పార్టీని కోలుకుండా చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అయితే ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా  ఇవ్వ‌కుండా నేల‌మ‌ట్టం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆ దెబ్బ‌నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తూనే అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. అధికార పార్టీ ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను త‌మ అస్త్రాలు మ‌లుచుకుంటున్న కాంగ్రెస్ ప్ర‌జా పోరాటాల‌కు సిద్ధ‌ప‌డుతోంది. తెలుగుదేశం ప్ర‌భుత్వం చేప‌డుతున్నఅప్ర‌జాస్వామిక విధానాల‌ను త‌ప్పుప‌డుతూ ఇటీవ‌లో కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌తో ఢిల్లీ వెళ్లి ఢిల్లీ పెద్ద‌ల‌ను క‌లిసి వ‌చ్చారు. అంతేకాదు రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌ను సాధించ‌డంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మ‌య్యాని దుయ్య‌బ‌డుతున్నారు. యూపీఏ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా 5 ఏళ్లు ఇస్తామ‌ని చెబితే కాదు..కాదు 10 ఏళ్లుకావాల‌ని ప‌ట్టుప‌ట్టిన ఎన్డీఏ స‌ర్కార్‌, చంద్ర‌బాబులు ఎప్పుడు ఏం చేస్తున్నార‌ని  రాష్ట్ర కాంగ్రెస్ స‌భ్యులు ప్ర‌శ్నిస్తున్నారు.  రాజ్యసభలో ఆ పార్టీ సీనియర్‌నేత, ఎంపీ కెవిపి రామచంద్రరావు పలుమార్లు ఏపికి ప్రత్యేక హోదాపై కేంద్రంలోని ఎన్‌డిఏ సర్కార్‌ను నిలదీశారు. ఏపికి ప్రత్యేక హోదా కోరుతూ ఏపి కాంగ్రెస్ నాయకత్వం పలు రూపాల్లో ఉద్యమాలు చేసిన విషయం తెలిసిందే. ఒకానోక దశలో ఏపికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటంతోనే రాష్ట్రంలోని ఇతర ప్రతిపక్షాలు ఉద్యమ కార్యచరణలోకి దిగాయని చెప్పవ చ్చు. ఏపికి ప్రత్యేక హోదా కోసం చేసిన పోరాటంతో జనం మద్దతు కూడగట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏపిలో జరిగిన తొలి ఉప ఎన్నిక అయిన నందిగామా ఉప ఎన్నికల్లో పోటీచేసి డిపాజిట్ దక్కించు కోగలిగింది. తద్వారా కాంగ్రెస్ పార్టీకి జనం మద్దతు పెరు గుతోందన్న సంకేతాలను ఆ పార్టీ పంపింది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులని ర్మాణంతో ఏపికి అందులోనూ రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం ఏర్పడుతుందని శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఇటీవల ఏపి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆందోళనకు దిగింది. వీట‌న్నింటినీ ప‌రిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంద‌ని, ఆ పార్టీకి పూర్వ వైభ‌వం వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని అనిపిస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →