ఎన్నికలకు ఎలా వెళ్లితే మంచిది?
సమాలోచనల్లో ఏపీ కాంగ్రెస్ సభ్యులు
భిన్నాభిప్రాయాలు తెలిపిన నాయకులు
గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒక్కసీటును కూడా గెలుచుకో లేకపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటినుంచే స్థానిక సంస్థల ఎన్నికల పై కసరత్తు చేసి కనీసం ఈ ఎన్నికల్లో గెలిచి ఉనికిని నిలబెట్టుకోవాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో సమీపిస్తున్న గ్రేటర్ విశాఖ కార్పోరేషన్ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కో వాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమాలోచనలు చేస్తోంది. గ్రేటర్ విశాఖ తోపాటు ఏపీ రాష్ట్రంలో వివిధ కారణాలు, కోర్టు కేసుల కారణంగా పలు మున్సి పాలిటీలలో ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. గ్రేటర్ విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో కనీసం మెరుగైన సీట్లను గెలుచుకొన్నా త్రిముఖపోటీలో మేయర్ ఎన్నికల్లో తాము కీలకంగా మారవచ్చని ఏపి కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు చేస్తోంది. పెండింగ్ కార్పోరేషన్ ఎన్నికల్లోనైనా సత్తాచాటి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీలో కాలుమోపాలన్న దిశగా బాటలు వేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
ఏపి రాష్ట్రంలో పెండింగ్‌లో పలు కార్పొరేషన్ల ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వస్తే టీడీపీ అధికా రంలోకి వచ్చిన సుధీర్ఘకాలం తరువాత వచ్చే ఎన్నికలు అవుతాయి. ఇలా ఎన్ని కలు పెండింగ్‌లో ఉన్న కార్పోరేషన్లలో విశాఖ పట్నం, కర్నూలు, గుంటూరు, రాజమండ్రి కార్పోరేషన్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన సుధీర్ఘకాలం తరువాత ఈ ఎన్నికలు వస్తే అటు అధికార పార్టీకి, ఇటు ప్రతిపక్ష పార్టీలకు ఈ ఎన్నికలు పరీక్షలేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఎన్నికలు ఒక్క కాంగ్రెస్‌పార్టీకే కాదు అన్ని పార్టీలకు, వాళ్ల పనితీరుకు అద్దం పట్టనున్నాయి. అందుకే అన్ని పార్టీల నాయకులు ఈ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోనున్నాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.